మహ్మద్ షమీ వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన షమీ, వన్డేల్లో 200 వికెట్లు పూర్తిచేసుకున్నాడు. ఇది అతని 103వ ఇన్నింగ్స్, ఈ ఫీట్‌ను సాధించిన భారత బౌలర్లలో అతనెవ్వరూ లేని వేగంలో ఉన్నారు. షమీ కేవలం 5126 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకుని మిచెల్ స్టార్క్, సక్లైన్ ముస్తాక్, బ్రెట్ లీ వంటి దిగ్గజాలను వెనక్కు నెట్టాడు.
ఇప్పటి వరకు ఈ ఘనత అజిత్ అగార్కర్(133 ఇన్నింగ్స్) దగ్గర ఉండగా, షమీ 30 ఇన్నింగ్స్ తక్కువలోనే ఆ రికార్డును తుడిచేసాడు. అలాగే జహీర్ ఖాన్ (144 ఇన్నింగ్స్), అనిల్ కుంబ్లే (147 ఇన్నింగ్స్)లను చాలా దూరం వెనక్కు పెట్టాడు. ఈ అద్భుత ప్రదర్శన షమిని వన్డే క్రికెట్‌లో భారత అత్యుత్తమ పేసర్‌గా నిలబెట్టింది.
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్లలో షమీ ఇప్పుడు 202 వికెట్లు తీసుకొని జడేజా (226), కపిల్ దేవ్ (253), హర్భజన్ సింగ్ (265) తర్వాత ఉన్నాడు. వయసు పెరిగే కొద్దీ అతని బౌలింగ్‌లో పటుత్వం మరింత పెరగడం గమనార్హం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని యార్కర్లు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నాయి.
కేవలం భారత పరిమితిలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా షమీ తన స్థానాన్ని బలపరుస్తున్నాడు. ప్రపంచ స్థాయి పేసర్లలో అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించిన ఆటగాడు స్టార్క్ (102 మ్యాచ్‌లు) మాత్రమే. షమీ 104 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. బంతుల పరంగా చూస్తే, అతను స్టార్క్ (5420 బంతులు) కంటే 294 బంతులు తక్కువలోనే ఈ ఫీట్ సాధించడం విశేషం.
ఈ చరిత్రాత్మక విజయంతో, షమీ భారత పేస్ బౌలింగ్‌కి కొత్త రూపం ఇచ్చాడని చెప్పవచ్చు. అతని పేస్, లైన్, లెంగ్త్ కంట్రోల్, అలాగే వికెట్లు తీయడంలోని నైపుణ్యం టీమిండియాకి కీలక బలంగా మారింది. ఈ ఫామ్ ఇలానే కొనసాగితే, షమీ మరిన్ని రికార్డులను తన ఖాతాలోకి జమ చేసుకోవడం ఖాయం.
This post was last modified on February 20, 2025 7:08 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…