Trends

చాంపియన్స్‌ ట్రోఫీకి బుమ్రా దూరం… ఫైనల్ టీమ్ ఇదే!

భారత క్రికెట్ జట్టుకు ప్రధాన ఆయుధం జస్ప్రీత్‌ బుమ్రా. అతను ఉంటే సగం మ్యాచ్ గెలిచినట్లే అని చాలాసార్లు రుజువైంది. గత టీ20 వరల్డ్ కప్ లో ఓటమి అంచున ఉన్న జట్టుకు తన బౌలింగ్ తో గెలుపు తీరాలకు చేర్చాడు. అయితే అలాంటి బౌలర్ చాంపియన్స్‌ ట్రోఫీకి మరో ఆయుధంగా నిలుస్తాడు అని అందరూ అనుకుకున్నారు. కానీ ఊహించని విధంగా టీమ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఈ టోర్నీకి అందుబాటులో ఉండబోడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడంతో బుమ్రాను జట్టు నుంచి తప్పించి, అతని స్థానంలో యువ పేసర్‌ హర్షిత్‌ రాణాను ఎంపిక చేశారు. ఈ నిర్ణయం భారత బౌలింగ్‌ విభాగానికి భారీ సమస్యగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత నెలలోనే బుమ్రా పేరును భారత జట్టులో చేర్చినప్పటికీ, ఫిట్‌నెస్‌పై సందేహాలు కొనసాగాయి. అతను బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (NCA) లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నప్పటికీ, ఇప్పటికీ 100% ఫిట్‌నెస్‌ సాధించలేదని వైద్య బృందం తేల్చిచెప్పింది. గాయంతో ఆడితే మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నందున అతన్ని జట్టులో కొనసాగించకుండా సెలక్టర్లు కొత్త ప్రత్యామ్నాయాన్ని వెతికారు. చివరకు యువ బౌలర్‌ హర్షిత్‌ రాణాకు అవకాశం లభించింది.

చాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ కీలకమైన బౌలర్‌ను కోల్పోవడం జట్టు వ్యూహాలకు పెద్ద దెబ్బ అని నిపుణులు చెబుతున్నారు. బుమ్రా అనుభవం, అతని యార్కర్లు, డెత్‌ ఓవర్లలో అతని ప్రభావం టీమిండియాకు ఎంతో అవసరమైన అంశాలు. అయితే, ఈ నిర్ణయంతో యువ పేసర్‌ హర్షిత్‌ రాణాకు అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించింది. మరోవైపు, బుమ్రా మార్చి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ నాటికి మైదానంలోకి రాకపోవచ్చని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారత జట్టులో తాజా మార్పుల తర్వాత అంచనా వేయబడిన జట్టులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, మహమ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రాణా, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, శ్రేయస్‌ అయ్యర్‌, యశస్వి జైస్వాల్‌, వరుణ్‌ చక్రవర్తి వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఈ మార్పులు భారత జట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.

This post was last modified on February 12, 2025 2:03 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago