ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్న తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ మొన్నటివరకు వరుసగా విఫలమవ్వడం జట్టుకు భారంగా మారిందనే కామెంట్స్ ఎక్కువగానే వచ్చాయి. ఫ్యాన్స్ తో పాటు సీనియర్ ఆటగాళ్లు సైతం పెదవివిరిచారు. అయితే ఈ ఒత్తిడిలోనే అతను బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ల్ రోహిత్ శర్మ తన పూర్వవైభవాన్ని తలపించారు. 90 బంతుల్లో 119 పరుగులు చేసి జట్టును విజయంలోకి నడిపించడమే కాకుండా, తన రీఎంట్రీను ఘనంగా ప్రదర్శించారు.
2023 అక్టోబర్ తర్వాత వన్డేల్లో రోహిత్ చేసిన తొలి సెంచరీ ఇది. గత 13 మ్యాచ్‌ల్లో అయిదు అర్ధశతకాలు చేసినప్పటికీ, పూర్తి స్థాయి శతకాన్ని నమోదు చేయడం ద్వారా ఫామ్‌ను తిరిగి అందుకున్నట్లు కనిపిస్తోంది. ఇక రోహిత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఒక విధంగా విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటట్ ఇచ్చారని చెప్పవచ్చు. ‘‘నేను చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నా. ఏమి చేయాలో నాకు తెలుసు. ఫామ్‌ను తిరిగి అందుకోవడం అంత తేలిక కాదు, కానీ ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుని ముందుకు సాగా’’ అని చెప్పారు.
బ్యాటింగ్ శైలిలో ఎలాంటి మార్పు చేయలేదని, తన సహజమైన ఆటతీరు ద్వారా ఫలితం సాధించగలిగానని రోహిత్ వివరించారు. పరుగులు చేయడం గురించి తనకు పూర్తిగా అవగాహన ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ఒత్తిడి, ఆటతీరు ప్రభావం చూపిస్తుందని రోహిత్ అన్నారు.
‘‘కెరీర్‌లో ఎన్నో పరుగులు చేశా. కానీ ఫామ్‌లోకి రావడం కష్టమే. ఎంతో శ్రమించాక మంచి ఇన్నింగ్స్ ఆడగలిగాను. నిజంగా ఆనందంగా ఉంది’’ అని తెలిపారు. ఈ సెంచరీతో రోహిత్ మాత్రమే కాదు, భారత జట్టుకూ ఊరట లభించింది.
ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ ముందు రోహిత్ ఫామ్ సాధించడం టీమిండియాకు మేలే. టోర్నమెంట్‌లో భారత జట్టు విజయవంతంగా రాణించాలంటే రోహిత్ లాంటి సీనియర్ ఆటగాళ్ల పరుగులు అవసరం.
This post was last modified on February 11, 2025 1:54 pm
పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…
ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…
నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…