మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్ క్లాష్ కూడా టీమిండియా మేన్స్ తరహాలో కొనసాగుతుండడం విశేషం. 2024 మేన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఇంగ్లండ్ ను రోహిత్ సేన ఓడించింది. ఇక ఆ తరువాత సౌత్ ఆఫ్రికాతో ఫైనల్స్ లో తలపడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అండర్ 19 అమ్మాయిల జట్టు కూడా అదే తరహాలో వెళ్లడం విశేషం.
భారత అండర్-19 యువ మహిళలు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరారు. మలేసియాలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లో ఇంగ్లండ్‌ను సెమీఫైనల్‌లో ఓడించి, మరో ఘన విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ బరిలోకి దిగగా, ఓపెనర్లు ధాటిగా ఆడుతూ విజయం సులభం చేశారు. కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి, ఇంకా 30 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకున్నారు.
భారత ఇన్నింగ్స్‌కు మంచి శుభారంభం లభించింది. ఓపెనర్ గొంగడి త్రిష 35 పరుగులతో ఆకట్టుకోగా, మరో ఓపెనర్ కమిలిని అర్ధశతకంతో అదరగొట్టింది. వీరిద్దరు కలిసి మొదటి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం అందించడంతో జట్టు విజయానికి బలమైన పునాది ఏర్పడింది. త్రిష అవుట్ అయిన తర్వాత కమిలిని ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వశం చేసుకుంది. 47 బంతుల్లో 7 బౌండరీలతో 56 పరుగులు చేసిన కమిలిని జట్టును విజయం వరకు నడిపింది.
ఇంతకు ముందు, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు ఈ విజయానికి బలమైన బేస్ అందించారు. పరునిక సిసోడియా, వైష్ణవి శర్మ చెరో 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. 4 ఓవర్లలో కేవలం 21 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసిన సిసోడియా అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకుంది.
ఈ విజయంతో భారత యువ మహిళల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ కోసం దక్షిణాఫ్రికాతో తలపడనుండటంతో క్రికెట్ ప్రేమికులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టు, చివరి క్లాష్ లో కూడా అదే దూకుడు కొనసాగిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది.
గత ఏడాది జరిగిన మెన్స్ టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ సేన సౌత్ ఆఫ్రికాను ఓడించి ఛాంపియన్స్ గా నిలిచింది. ఇక ఇప్పుడు అండర్ 19 అమ్మాయిలు కూడా అదే తరహాలో పోరాడి ఛాంపియన్స్ గా నిలుస్తారేమో చూడాలి.
This post was last modified on January 31, 2025 4:13 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…