అమెరికాలో మిలటరీ హెలికాప్టర్, ప్రయాణికులతో వెళ్తున్న విమానం మధ్య జరిగిన ఘర్షణలో 64 మంది ప్రయాణికులు, ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటివరకు 27 మంది ప్రయాణికుల మృతదేహాలు, హెలికాప్టర్ లోని ఒక దేహాన్ని బయటకు తీశారు. మిగతా మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ ఘటన వర్జీనియాలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగింది. విమానం ల్యాండ్ అవుతుండగా ఎదురుగా వచ్చిన మిలటరీ హెలికాప్టర్ ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించి, రెండు వాహనాలు పొటోమాక్ నదిలో కూలిపోయాయి. ప్రమాద తీవ్రతను బట్టి విమానంలోని ప్రయాణికులెవరూ బతికే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు.
అదే సమయంలో ఎయిర్‌పోర్టు పరిధిలోని అన్ని విమానాల టేకాఫ్, ల్యాండింగ్స్‌ను నిలిపివేశారు. విమానాశ్రయం సిబ్బంది ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. పొటోమాక్ నదిలో హెలికాప్టర్, విమానం శకలాలను వెతికే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించినప్పటికీ, ఎవ్వరినీ సజీవంగా కాపాడలేకపోయామని అధికారులు తెలిపారు. మిలటరీ హెలికాప్టర్, విమానం మధ్య ఈ ఘర్షణ ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది? ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
This post was last modified on January 30, 2025 10:29 pm
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…