Trends

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం హైప్ ఎక్కిస్తున్న ధోని

కెప్టెన్ కూల్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే. అతని బ్రాండ్ ఇమేజ్ తోనే ప్రస్తుతం CSK కు క్రేజ్ పెరుగుతోందని చెప్పవచ్చు. ఒకప్పటి జనరేషన్ కు MSD ఆల్ టైమ్ పేవరేట్. అందుకే ధోని ఎక్కడున్నా కూడా ఆ హడావుడి చాలా ఎక్కువగానే ఉంటుంది. ఏదేమైనా ఇప్పట్లో ధోని లేని ఐసీసీ టోర్నమెంట్స్ ను చూడడం అనేది ఓ వర్గం క్రికెట్ లవర్స్ కు మింగుడు పడడం లేదు. ఇక మెజారిటి ఫ్యాన్స్ ను ఆకట్టుకోవాలి అని హాట్ స్టార్ పెద్ద ప్లాన్ వేసింది.

ఇక ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఈ ప్రోమోలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కనిపించడంతో అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి పెరిగింది.

కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించిన ధోనీ ఇప్పుడు ఫ్యాన్‌గా మ్యాచ్‌లను వీక్షించబోతున్నాడు. అయితే ఈసారి మ్యాచ్‌ల ఉత్కంఠ తనను కూల్‌గా ఉంచేలా లేవని తనదైన శైలిలో సరదాగా కామెంట్ చేశాడు. ప్రోమోలో ధోనీ తన మార్క్ కామెడీ టచ్‌తో కనిపించాడు.

“నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాను. అప్పట్లో చాలా కూల్‌గా ఉండగలిగాను. కానీ ఇప్పుడు అభిమానిగా చూడటం కాస్త హాట్‌గా అనిపిస్తోంది. టోర్నీ పోటీ చాలా హై ఇంటెన్సిటీగా ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోతే.. ఇక టోర్నీకి గుడ్‌బై చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది” అని ధోనీ చెప్పడం ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది.

ఈ వీడియోలో ధోనీ ‘డీఆర్ఎస్’ (ధోనీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్) అనే కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేశాడు. మ్యాచ్ టెన్షన్ నుంచి బయటపడేందుకు చల్లని గడ్డలతో తయారు చేసిన టోపీ, బట్టలు ధరిస్తూ కనిపించాడు. కానీ అవి సరిపోవడం లేదని, మరింత చల్లదనం అవసరమని సరదాగా చెప్పిన తీరు అభిమానులకు విశేషంగా నచ్చింది. ధోనీ ప్రధాన పాత్రలో ఉండటంతోనే ఈ ప్రోమో ప్రత్యేకంగా నిలిచింది.

ఇక 2013లో ధోనీ సారథ్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోపి టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల తర్వాత మరోసారి భారత్ ఈ టైటిల్‌ను గెలుచుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా మంచి ఫామ్‌లో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తోంది.

అయితే పోటీ తీవ్రంగా ఉండటంతో ప్రతీ మ్యాచ్ చాలా కీలకంగా మారనుంది. ధోనీ చెప్పినట్టుగానే, ఒక్క తప్పు జరిగినా కూడా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితిని తెచ్చేస్తుంది. మరి ఈ సారి భారత్ మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడుతుందా? లేదా అనేది వేచి చూడాలి.

This post was last modified on January 29, 2025 7:28 pm

Share

Recent Posts

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

57 seconds ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

13 minutes ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

30 minutes ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

41 minutes ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

41 minutes ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

54 minutes ago