భారత క్రికెట్ అభిమానుల ఆశలపై మరోసారి మబ్బులు కమ్ముకున్నాయి. త్వరలో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ ప్రశ్నార్థకంగా మారింది. ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో బుమ్రా హాజరుకావడం అనుమానంగా మారిందని సమాచారం.
గతంలో గాయపడ్డ బుమ్రా, ఆస్ట్రేలియాతో చివరి టెస్టు నుంచి బయటే ఉన్నాడు. ప్రస్తుతానికి అతను న్యూజిలాండ్‌లోని ప్రముఖ సర్జన్ రోవాన్ స్కౌటెన్‌తో టచ్‌లో ఉన్నాడని, అక్కడే చికిత్స పొందే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే, బుమ్రా 100 శాతం కోలుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ అతనికి బదులుగా హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్‌లను బ్యాకప్‌గా సిద్ధం చేస్తోంది.
చికిత్స కోసం న్యూజిలాండ్ వెళ్లే అంశాన్ని ఇంకా ఫైనల్ చేయలేదని, అందుకు సంబంధించిన అన్ని రిపోర్టులను డాక్టర్ స్కౌటెన్‌కు పంపిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టోర్నీ సమయానికి బుమ్రా ఫిట్ అవడం కష్టమేనని తెలుస్తోంది. ఒకవేళ కోలుకోకపోతే, బీసీసీఐ అతని స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాకు అవకాశమిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇంగ్లండ్‌తో త్వరలో జరగబోయే వన్డే సిరీస్ టోర్నమెంట్‌కు ముందు కీలకంగా మారనుంది. ఈ సిరీస్‌లో రాణా ఇప్పటికే జట్టులో ఉన్నాడు. టోర్నీకి ముందు బుమ్రా ఇంకా అందుబాటులోకి రాకపోతే, రాణా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా స్థానం పొందడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ బుమ్రా ఈ టోర్నీకి అందుబాటులో లేకపోతే, భారత బౌలింగ్ దళంపై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, అతని గాయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.
This post was last modified on January 27, 2025 2:51 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…