Trends

ఎంపీలో ఘోరం!… శోభనానికి ముందు కన్యత్వ పరీక్ష!

దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ పురుష సమాజం మాత్రం ఇంకా కారు చీకట్లోనే ఉండిపోతానంటోంది. ఈ మాట నిజమేనన్నట్టుగా మధ్య ప్రదేశ్ లో ఓ దారుణం వెలుగు చూసింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ దారుణంపై బాధిత మహిళ నోరు విప్పి న్యాయం కోసం పోరాటం చేసేందుకే ఏళ్ల సమయం పట్టిందంటే… పరిస్థితులు ఇంకా ఎలా ఉన్నాయో ఇట్టే అర్థం కాక మానదు.

సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే…మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఓ మహిళకు 2019లో భోపాల్ కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. అనంతరం అందరి మాదిరే కోటి కొత్త ఆశలతో దాంపత్య బంధంలోకి అడుగు పెడుతున్నానని సదరు యువతి సంబరపడింది. అయితే ఆ సంబరం ఆమెలో ఎంతో సేపు నిలవలేదు. ఎందుకంటే… తనను పెళ్లి చేసుకున్న భర్త, అతడి కుటుంబం శోభనానికి ముందు ఓ దారుణానికి పాల్పడింది. ఆ మహిళకు నిందితులు కన్వత్య పరీక్ష నిర్వహించారు. అది కూడా నాటు పద్ధతుల్లో ఈ పరీక్షను ఆ దుర్మార్గులు చేపట్టింది.

ఆ సమయంలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో సదరు మహిళ నరక యాతన అనుభవించింది. ఓ వైపు మానసిక వేధన, మరోవైపు నాటు పద్ధతుల్లో జరుగుతున్న పరీక్షతో శారీరక బాధతో ఆమె సతమతమైపోయింది. అయితే… నాడు దీనిపై ఎలా స్పందించాలో కూడా ఆమెకు తెలియలేదు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని పంటి బిగువునే భరిస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. అయితే ఆ తర్వాత కూడా భర్త కుటుంబం తమ దారుణాలను ఆపలేదు. పెళ్లి జరిగిన తర్వాత తొలిసారి ఆమె గర్భం దాలిస్తే… దానిపైనా అనుమానంగా చూసి అబార్షన్ చేయించింది.

ఇన్ని జరిగినా… తనకు పెళ్లి జరిగి ఐధేళ్లు పూర్తి అవుతున్నా కూడా తన పట్ల భర్త తరఫు కుటుంబం అనుసరిస్తున్న వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఐధేళ్ల పాటు అవమానాలు పడుతూనే భర్త ఇంట కాపురం చేసిన బాధితురాలు… న్యాయ పోరాటం చేయాలని తీర్మానించుకుంది. తన కుమార్తెతో కలిసి భర్త ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె నేరుగా ఇండోర్ జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బాధితురాలు చెప్పిన విషయాన్ని విన్న కోర్టు ఆమె భర్త కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది.

This post was last modified on January 22, 2025 3:54 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

1 hour ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

5 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

6 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

6 hours ago