Trends

ఏపీఎస్ఆర్టీసీకి సంక్రాంతి డబుల్ బొనాంజా

ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలు భారీ ఎత్తున తమ సొంతూళ్లకు తరలి వెళ్లారు. ఫలితంగా ఏపీకి దారి తీసే రహదారులన్నీ రద్దీతో కిటకిటలాడాయి. అదే సమయంలో జనాన్ని తమ సొంతూళ్లకు చేరవేసేందుకు శ్రమించిన ఏపీఎస్ఆర్టీసీకి డబుల్ లాభాలు దక్కాయి.

ఈ ఏడాది సంక్రాంతి వేడుకల కోసం హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి దాదాపుగా 5 లక్షల మంది వెళ్లారు. పండుగ సంబరాలు ముగించుకుని అంతే స్థాయిలో జనం తిరుగు ప్రయాణమయ్యారు. వెరసి వీరందరినీ అటు వారి సొంతూళ్లకు చేర్చడంతో పాటుగా వారిని తిరిగి వారి కార్య స్థానాలకు చేర్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏకంగా 9,097 బస్సులను నడిపింది. అంటే… దాదాపుగా 10 వేల సర్వీసులను వినియోగించిన ఆర్టీసీ… 10 లక్షల మంది ప్రయాణాలను పూర్తి చేసింది.

ఈ ప్రయాణాలకు గానూ ఏపీఎస్ఆర్టీసీకి ఏకంగా రూ.23.71 కోట్ల మేర ఆదాయం లభించింది. సంక్రాంతి పండుగకు జనాలు తమ ఊళ్లకు చేరడతోనే రూ.12 కోట్ల మేర ఆదాయం లభించిందని ఇదివరకే ఆర్టీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుగు ప్రయాణాలు కూడా పూర్తి కావడంతో… సంక్రాంతి ప్రయాణాలు ముగిశాయని ప్రకటించిన ఆర్టీసీ…ఈ సంక్రాంతికి తమకు డబుల్ బొనాంజా అందినట్లుగా ఏకంగా రూ.23.71 కోట్ల మేర ఆదాయం వచ్చినట్టు గర్వంగా ప్రకటించింది.

This post was last modified on January 22, 2025 9:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

36 minutes ago

కాకినాడ పోర్టు మళ్లీ కేవీ రావు చేతికి.. డీల్ కు అరబిందో రెఢీ

గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…

1 hour ago

జపాన్ జనాలకు కల్కి ఎక్కలేదా

ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…

1 hour ago

చరిత్రలో తొలిసారి: మారథాన్ లో మనిషితో రోబోలు

మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…

1 hour ago

ఫ్యాషన్ ఐకాన్ లా నారా లోకేశ్!

నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……

2 hours ago

ట్రంప్ కేబినెట్ నిండా బిలియనీర్లే

అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…

3 hours ago