Trends

నెంబర్ వన్ రికార్డుకి సిద్ధమైన ఇండియన్ బౌలర్

భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు అర్ష్‌దీప్‌ సింగ్‌ పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అర్ష్‌దీప్ తన కెరీర్‌లో అత్యున్నత ఘనత సాధించేందుకు సిద్ధమయ్యాడు. టీమిండియా తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడానికి అతడికి కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి. ప్రస్తుతం ఈ రికార్డ్ లెగ్‌ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ (96 వికెట్లు) పేరున ఉంది.

60 టీ20 మ్యాచ్‌ల్లో 95 వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌, తన సగటు 18.1, స్ట్రైక్ రేట్ 13.05తో టీమిండియా బౌలింగ్ స్థాయిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. ఇంగ్లాండ్‌ పై మొదటి మ్యాచ్‌లో రెండు వికెట్లు సాధిస్తే చాహల్‌ను అధిగమించి భారతీయ టీ20 చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. అంతేకాదు, ఈ సిరీస్‌లో అర్ష్‌దీప్‌ 100 వికెట్ల మైలురాయిని చేరుకుని భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త పేజీ లిఖించేందుకు సిద్ధమయ్యాడు.

హార్దిక్ పాండ్యా కూడా ఈ జాబితాలో తన పేరు సునామీలా చెరపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటివరకు 97 టీ20 ఇన్నింగ్స్‌లో 89 వికెట్లు సాధించిన అతడు, ఈ సిరీస్‌లో ఐదు వికెట్లు తీస్తే 100 వికెట్ల ఘనత చేరుకుంటాడు. అయితే, టీమిండియా ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా నిలిచినా, 100 వికెట్లు తీసిన బౌలర్‌ లేని పరిస్థితి ఇప్పుడు ముగియనుంది.

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల రికార్డ్‌లు:

యుజ్వేంద్ర చాహల్‌: 96

అర్ష్‌దీప్‌ సింగ్‌: 95

భువనేశ్వర్‌ కుమార్‌: 90

జస్ప్రీత్‌ బుమ్రా: 89

హార్దిక్‌ పాండ్యా: 89

This post was last modified on January 21, 2025 6:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సీతమ్మ వాకిట్లో.. నాగ్ వాకిట నుంచే

ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…

41 minutes ago

బీజేపీలో పాత సామాన్లు: రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే, వివాదాల‌కు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

4 hours ago

హీరో-డైరెక్టర్ ‘పాడు కాస్ట్’ అదిరిపోలా

కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్‌కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…

5 hours ago

దేశవ్యాప్తంగా 5G.. ఏ రేంజ్ లో ఉందంటే..

భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…

6 hours ago

నా సినిమా సేఫ్ అంటున్న దర్శకుడు

‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…

6 hours ago

బాబుతో నాగం భేటీ… ఎన్నెన్ని తీపి గురుతులో?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…

7 hours ago