టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఎందుకనో గానీ ఇటీవలి కాలంలో ఏ ఒక్కటీ కలిసి రావడం లేదు. టీమిండియా జట్టులో కీలక ప్లేయర్ గా రాణించిన గంభీర్.. ఆ తర్వాత ప్రతి విషయంలోనూ ప్రతికూల ఫలితాలనే చవిచూస్తున్నాడు. తాజాగా తన కెరీర్ లోనే టాప్ జాబ్ గా పరిగణిస్తున్న టీమిండియా హెడ్ కోచ్ పదవిని అతడు నిర్దేశిత గడువు కంటే ముందుగానే కోల్పోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు.
గతేడాది జులైలో టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గంభీర్… 2027 దాకా ఆ పదవిలో కొనసాగనున్నాడు. ఈ మేరకు బీసీసీఐతో అతడికి అగ్రిమెంట్ కుదిరింది. అయితే కోచ్ గా జట్టుపై గంభీర్ తన ముద్ర వేయలేకపోయాడు.
గంభీర్ కోచ్ గా వచ్చాక జ్జట్టు 10 టెస్ట్ మ్యాచులు ఆడితే… ఏకంగా ఆరింటిలో పరాజయం పాలు అయ్యింది. శ్రీలంకతో వన్డే సిరీస్ ను కోల్పోయింది. ఇక ఇటీవలే ఆస్ట్రేలియాతో కీలకమైన బోర్డర్ గవాస్కర్ సిరీస్ నూ కోల్పోయింది.
ఈ క్రమంలో జట్టు కోచ్ గా గంభీర్ పాత్రపై నీలినీడలు కమ్ముకున్నాయి. త్వరలో జరగనున్న ఛాంపియన్ ట్రోఫీ భారత జట్టుకు అత్యంత కీలకమని చెప్పాలి. ఈ సిరీస్ లో జట్టు ప్రదర్శన బాగుంటే ఓకే.. లేదంటే గంభీర్ పోస్ట్ కు ఊస్టింగ్ తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వెరసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫలితం గంభీర్ భవితవ్యాన్ని తేల్చనుందన్న మాట.
అయినా…టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ జట్టు సభ్యుల ప్రతిభ పెంచడానికి బదులుగా ఇతరత్రా విషయాలపై దృష్టి పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. డ్రెస్సింగ్ రూమ్ లో సూపర్ స్టార్ కల్చర్ ను నిర్మూలించే బాధ్యతను గంభీర్ భుజానికి ఎత్తుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారట.
జట్టు విజయాల్లో ఏమంత కీలకం కానీ ఈ విషయం ఫై అతడు ఎందుకు దృష్టి సారిస్తున్నాడో కూడా అర్థం కావడం లేదని క్రికెట్ పండితులు చెబుతున్నారు. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి ప్రమాదంలో పడటం గంభీర్ కు పరిపాటిగా మారిందని కూడా వారు చెబుతున్నారు.
This post was last modified on January 15, 2025 9:28 am
పండగ పేరునే సినిమా టైటిల్ పెట్టుకుని రావడం అరుదు. అందులోనూ స్టార్ హీరో అంటే ప్రత్యేకమైన అంచనాలు నెలకొంటాయి. ప్రకటన…
ఒకప్పుడు తెలుగు తమిళ సినిమాలను కొనే విషయంలో అలసత్వం ప్రదర్శించడం ఎంత పెద్ద తప్పో ఆర్ఆర్ఆర్ తర్వాత గుర్తించిన నెట్…
ఏదైనా పెద్ద సినిమా షూటింగ్ మధ్యలోనో లేదా పూర్తయ్యాకనో టీజర్ లేదా గ్లింప్స్ వదలడం సహజం. కానీ అసలు సెట్స్…
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్,…
ఇవాళ విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఓపెనింగ్స్ కి ట్రేడ్ నివ్వెరపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టడం చూసి…
థియేటరా ఓటిటినా అనేది పక్కనపెడితే భారతీయుడు 3 బయటికి రావడమైతే పక్కానే. కానీ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అయితే…