టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డేటింగ్‌లో ఉన్నారన్న ప్రచారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీతో రిలేషన్‌షిప్ ఉందంటూ ప్రచారమవుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా, బీచ్‌లో హగ్ చేసుకుంటున్న ఫొటో కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ ఫొటోకు ఇప్పటికే వేలాది లైకులు, షేర్లు, కామెంట్లు వచ్చాయి. అయితే, దీనిపై నిజానిజాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.
సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్ నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు షమీ కూడా తన భార్య హసీన్ జహాన్‌తో విడాకుల కేసు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో షమీ, సానియా మధ్య ప్రత్యేక బంధం ఉందంటూ ప్రచారం ఊపందుకుంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు వార్తలు వెలువడ్డాయి.
ఇక వైరల్ ఫొటోను పరిశీలించినప్పుడు, అది పూర్తిగా మార్ఫింగ్ చేసినదని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. ఈ ఫొటో ఎక్కడా షమీ, సానియా అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా దీనిని సృష్టించినట్లు తేలింది. ఇలాంటి ఫొటోలు క్రియేట్ చేయడం ద్వారా సెలబ్రిటీల గౌరవాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న ఈ రూమర్స్ పట్ల అభిమానులు అప్రమత్తంగా ఉండాలి. నిర్ధారణ లేని సమాచారం పట్ల నమ్మకంగా వ్యవహరించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
This post was last modified on December 29, 2024 2:02 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…