ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ.. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి.. చురకలు అంటించారు. ఆయన గత కొన్నాళ్లుగా పనిగంటల విషయంలో ఓ సూత్రం చెబుతున్నారు. వారానికి 70 గంటలు పనిచేయాలని ఆయన సూత్రీకరిస్తున్నారు. వాస్తవానికి ప్రపంచ దేశాలు సహా భారత దేశ లెక్కల ప్రకారం.. వారానికి 48 గంటలు మాత్రమే పనిచేయాలి. రోజుకు 8 గంటల చొప్పున వారానికి ఆరు రోజులు లెక్క వేస్తారు. దీని ప్రకారం.. 48 గంటలు పనిచేస్తే.. సరిపోతుందనేది ఒక లెక్క.
ఇక, వైట్ కాలర్ జాబ్స్ విషయంలో రోజుకు 6.30 గంటలు మాత్రమే పనిచేస్తారు. ఉదాహరణకు బ్యాంకింగ్, స్టాక్స్, అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. అంటే.. వారానికి 38 గంటలే పనిచేయాలన్నది నిబంధన. అయితే.. దీనిని ఆది నుంచి కూడా నారాయణ మూర్తి విభేదిస్తున్నారు. వారానికి 70 గంటలు పనిచేయాలని ఆయన చెబుతున్నారు. అంటే.. రోజుకు 11-12 గంటల పాటు వ్యక్తులు పనిచేయాలన్నది ఆయన సూత్రం. కానీ, ఆయన సూత్రాన్ని విభేదించే వారే ఎక్కువగా ఉన్నారు తప్ప.. సమర్థించేవారు లేరు.
మరీ ముఖ్యంగా ఇప్పటికిప్పుడు తనను ఎవరైనా సమర్థిస్తే.. ఆవెంటనే తన సూత్రాన్ని ముందుగా.. తన సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లోనే ప్రవేశ పెట్టాలన్నది నారాయణ మూర్తి కల. కానీ, దీనిని సమర్థించడం లేదు. దీంతో తరచుగా ఆయన చురకలు అంటిస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన నారాయణ మూర్తి.. ఇదే కోవలో ఆయన రియాక్ట్ అయ్యారు. దేశంలో పేదరికం.. ఉందంటారు. మరి పనిచేయకపోతే ఎలా? అని నిలదీశారు. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం.. దేశంలో 80 కోట్ల మంది రేషన్‌బియ్యం తీసుకుంటున్నారని.. అంటే.. వీరంతా పేదలే కదా! అని ప్రశ్నిస్తున్నారు.
దేశంలో పేదరికం పోవాలంటే.. ఖచ్చితంగా పనిచేయాల్సిందేనని.. అది కూడా.. ఎక్స్‌ట్రీమ్‌గా కష్టపడాలని నారాయణ మూర్తి వాదన. దేశంలో పేదరికం ఉందని ఉపన్యాసాలు ఇస్తే కుదరదని వ్యాఖ్యానించారు. దీనిని రూపు మాపాలంటే.. 70 గంటలు పనిచేస్తే..ఉత్పాదకత పెరుగుతుందని.. తద్వారా.. మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ఆయన చెబుతున్నారు. “మాటలు వద్దు.. చేతలకు దిగండి. అప్పుడు మాటలు ఉండవు.. ఫలితం కనిపిస్తుంది” అని నారాయణ మూర్తి తెగేసి చెప్పారు.
This post was last modified on December 16, 2024 11:26 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…