అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత దేశానికి చెందిన హిందువుల అంశం ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. కీలకమైన వీరి ఓట్లను అందిపుచ్చుకునేందుకు రెండు పార్టీలూ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి తగిన విధంగా వారు దూసుకుపోతున్నారు. అధికార డెమొక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్‌లు కూడా భారతీయ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో కమలా హ్యారిస్‌కు ఎలానూ భారతీయ మూలాలు ఉన్నాయి కాబట్టి.. ఆమె తరఫున ప్రచారం బాగానే ఉంది. ఎటొచ్చీ.. భారతీయ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ఇతర పెట్టుబడి దారీ వర్గాలు మాత్రమే ట్రంప్‌వైపు నిలబడ్డాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ మరో నాలుగు అడుగులు ముందుకు వేశారు. భారత దేశానికి చెందిన హిందూ సామాజిక వర్గాలను తనవైపు తిప్పుకొనేందుకుఆయన తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాను గెలిచి అధికారంలోకి వస్తే.. అమెరికాలోని హిందువుల రక్షణ బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. అంతేకాదు.. హిందువులను అవమానిస్తున్న, వారి ధర్మాన్ని అవమానిస్తున్న.. ‘ర్యాడికల్ లెఫ్ట్’ను(వాస్తవానికి లెఫ్ట్, దీనికి ట్రంప్ ర్యాడికల్ జోడించారు) అదుపులో ఉంచుతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. లెఫ్ట్ నేతలు.. ధర్మ వ్యతిరేక అజెండాను అనుసరిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో హిందువులు మనో వేదనకు గురవుతున్నారని చెప్పారు.
అందుకే.. తాను అధికారంలోకి వచ్చాక హిందువుల రక్షణ బాధ్యతలు తీసుకుంటానన్నారు. మరోవైపు.. భారత ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఈ సందర్భంగా ట్రంప్ కొనియాడారు. తన మిత్రుడు మోడీతో తనకు ఎనలేని సంబంధం ఉందన్నారు. ఆయన పట్ల గౌరవ చిత్తం(రెస్పెక్టెడ్ మైండ్)తో పాటు.. అభిమానం(ఎఫెక్షన్) ఉందన్నారు. తాను అధికారంలోకి వచ్చాక భారత్‌తో అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ట్రంప్ భారతీయ అమెరికన్లకు హామీ ఇచ్చారు. తనకు మద్దతు ఇవ్వాలని.. ఆయన విన్నవించారు. కాగా, మరో మూడు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల మెయిల్, రిజిస్టర్ పోస్టులలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
This post was last modified on November 2, 2024 6:24 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…