Trends

రైల్వే కొత్త నిర్ణయం: టికెట్ రిజర్వేషన్ రూల్ మారింది

ఇప్పటి వరకు రైల్వేల్లో ముందస్తుగా సీట్లు రిజర్వు చేసుకునే గడువు 120 రోజులు ఉండేది. కానీ, నవంబర్ 1 నుండి ఈ గడువును 60 రోజులకు మాత్రమే పరిమితం చేస్తూ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుతో ప్రయాణికులు ఇకపై కేవలం రెండు నెలల ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే బోర్డు ఈ నిర్ణయంపై వివరణ ఇస్తూ, 120 రోజుల గడువు ఉండటం వల్ల టికెట్ రద్దులు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పింది.

ముఖ్యంగా 21 శాతం టికెట్లు రద్దు అవుతుండటం గమనార్హం. టికెట్లు బుక్ చేసుకున్నవారు ఆ సమయంలో ప్రయాణం చేయకపోవడం వల్ల సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయని పేర్కొంది. ఇది ప్రయాణికులకు అసౌకర్యంగా మారుతోందని తెలిపింది. దీని వల్ల పలు రకాల మోసాలు జరుగుతున్నాయి. ముందుగానే పెద్ద సంఖ్యలో సీట్లు బుక్ చేసుకొని తర్వాత అక్రమంగా అమ్మడం, లేదా ఇతర ప్రయోజనాల కోసం బ్లాక్ చేయడం వంటి చర్యలకు ఈ గడువు ఎక్కువగా ఉండటం సహకరిస్తోందని రైల్వే బోర్డు తెలిపింది.

తక్కువ గడువు నిర్ణయం వల్ల ఇలాంటి దుర్వినియోగాలను నివారించవచ్చని పేర్కొంది. 60 రోజుల గడువు నిజమైన ప్రయాణికులకు అనువుగా ఉంటుందని, తమ ప్రయాణానికి ఒకటి లేదా రెండు నెలల ముందే ప్లాన్ చేసే వారికి ఇది మరింత సౌకర్యవంతంగా మారుతుందని బోర్డు అభిప్రాయపడింది. అదనంగా, ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉంటే ప్రత్యేక రైళ్లు సులభంగా ఏర్పాటు చేయడం కూడా సాధ్యమవుతుందని వెల్లడించింది.మ్ముఖ్యంగా పండుగలు, సెలవులు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో టికెట్ల డిమాండ్ పెరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 60 రోజుల ముందస్తు రిజర్వేషన్ విధానం రైల్వే శాఖకు ప్రయోజనకరంగా ఉంటుంది.

This post was last modified on October 18, 2024 3:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వెంకటేష్ పాత స్కూలు…..గ్యారెంటీ వినోదం

విక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఎక్కడా ఆగకుండా నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నవంబర్…

1 hour ago

రజనికాంత్ మాస్ ఉచ్చులో దర్శకుల తప్పులు

కొందరు దర్శకులు కమర్షియల్ ప్రపంచానికి దూరంగా తమదైన శైలిలో కొత్త జానర్లు టచ్ చేస్తూ, ఎప్పుడూ చూడని కథలను పరిచయం…

2 hours ago

సమంత చేయనని చెప్పినా వదల్లేదు

టాలీవుడ్లో ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు అవకాశాలే లేని స్థితికి చేరుకుంది. ఇందుకు ప్రధాన కారణం ఆమె…

3 hours ago

బీజేపీ మౌత్ పీస్‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. !

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇక‌, బీజేపీకి మౌత్ పీస్‌గా మార‌నున్నార‌నే సంకేతాలు అందుతున్నాయి. తాజాగా…

4 hours ago

వైవీ పోయి సాయిరెడ్డి వ‌చ్చే.. !

ఉత్త‌రాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్ విష‌యంలో వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న మార్పు చేశారు. గ‌తంలో ఉన్న‌ట్టుగానే…

4 hours ago

జపాన్ దేశంలో RRR మెంటల్ మాస్ రికార్డు

థియేటర్లలో రిలీజై రెండేళ్లు దాటిపోయింది కాబట్టి ఏదో టీవీలో వచ్చినప్పుడో, యూట్యూబ్ లో క్లిప్పులు చూసినప్పుడో తప్ప ఆర్ఆర్ఆర్ ని…

4 hours ago