నభూతో అన్న తరహాలో అత్యంత వినోదభరితంగా, ఉత్కంఠగా సాగుతోంది ఇండియన్ ప్రిమియర్ లీగ్. టోర్నీ లీగ్ దశలో ఇక మిగిలినవి నాలుగే మ్యాచ్‌లు. కానీ ఇప్పటికీ ఒక్క జట్టుకే ప్లేఆఫ్ బెర్తు ఖరారైంది. మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య పోటీ నెలకొంది. శనివారం రెండు మ్యాచ్‌లు జరగ్గా ప్లేఆఫ్ బెర్తులపై ఉత్కంఠను ఇంకా పెంచేలా ఆ మ్యాచుల్లో ఫలితాలు వచ్చాయి.
ముంబయిపై ఢిల్లీ గెలిచుంటే ఆ జట్టుకు ప్లేఆఫ్‌కు వెళ్లిపోయేది. అలాగే బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓడిపోయుంటే ఆ జట్టు నిష్క్రమించేది, కోహ్లీ జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధించేది. కానీ అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల వల్ల ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. ఇక్కడో కీలకమైన ట్విస్టు ఏంటంటే.. బెంగళూరు, ఢిల్లీ తమ చివరి మ్యాచ్‌లో పరస్పరం తలపడబోతున్నాయి.
ఒక దశలో ఢిల్లీ 9 మ్యాచుల్లోనే ఏడు విజయాలు సాధించింది. బెంగళూరు 10 మ్యాచుల్లోనే ఏడు గెలిచేసింది. ఢిల్లీకి మిగిలిన ఐదు మ్యాచుల్లో, బెంగళూరు ఆడాల్సిన నాలుగు మ్యాచుల్లో ఒక్కో విజయం సాధించడం పెద్ద విషయమే కాదు అనుకున్న ఈ జట్లు వరుసగా నాలుగు, మూడు మ్యాచ్‌ల్లో ఓడి పీకల మీదికి తెచ్చుకున్నాయి. ఇక తమ చివరి మ్యాచ్‌లో పరస్పరం తలపడబోతున్న నేపథ్యంలో గెలిచే జట్టు ప్లేఆఫ్ బెర్తును దక్కించుకుంటుంది. ఈ రెండు జట్లకూ నెట్ రన్‌రేట్ బాగా తక్కువే ఉంది. కాబట్టి ఓడే జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చెన్నై, ముంబయిలతో తమ చివరి మ్యాచ్‌లు ఆడబోతున్న పంజాబ్, సన్‌రైజర్స్ వాటిలో గెలిచాయంటే అవే ప్లేఆఫ్‌కు వెళ్తాయి.
వాటితో పోలిస్తే ఢిల్లీ, బెంగళూరు జట్ల నెట్ రన్‌రేటే తక్కువుంది. కాబట్టి వీటి మధ్య మ్యాచ్‌లో ఓడే జట్టు టోర్నీ నుంచి ఔట్ అయితే ఆశ్చర్యమేమీ లేదు. మరోవైపు ఆదివారం రాత్రి రాజస్థాన్, కోల్‌కతా తలపడనుండగా.. అందులో ఓడే జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఏ జట్టు గెలిచినా ముందంజ వేయడం అంత సులువు కాదు. ఎందుకంటే రెండు జట్ల రన్‌రేటూ చాలా తక్కువగా ఉంది. వీటిలో ఏది గెలిచినా.. పంజాబ్, సన్‌రైజర్స్‌లో ఏదో ఒకటి ఓడిపోవాలని, ఢిల్లీ-బెంగళూరు మ్యాచ్‌లో ఓడే జట్టు రన్‌రేట్ తమ కంటే దిగువన ఉండాలని కోరుకుంటాయి. అప్పుడే ముందంజ వేయడానికి అవకాశముంటుంది.
This post was last modified on November 1, 2020 12:32 pm
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…