బాబు ఈజ్ బాస్

బాబు ఈజ్ బాస్

జరగాల్సిన వన్నీ జరిగాయి, జరగకూడవనివి కూడా జరిగినా... ఇప్పుడు అవి కూడా అందరి మంచికే జరిగాయి అని సరిపెట్టుకోవాల్సిందే. రాష్ట్రం విడిపోయింది. విడిపోవడానికి కారకులెవరు అన్నది పక్కన బెడితే ఈ పాపం అందరు ఒకరిపై మరొకరు వేసే ప్రయత్నాలు చేసారు. దానిలో ఎవరు గెలిచారు అన్నది ప్రజలు తేల్చేసారా, లేదా? ఎలాగు విడిపోయాం, ఇక పాపం ఎవరిది అంటూ ఆరాలు తీసే బదులు ఇక అభివృద్ది చూసుకుందాం అనుకున్నారా... ఏది ఏమైనా మొత్తానికి సమైక్యాంధ్రలో గెలిచింది మాత్రం చంద్రబాబే. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కు సర్ ఆయనే అన్న విషయాన్ని మాత్రం జనం తేల్చి చెప్పారు.

ఇంకెక్కడి సమైక్యాంధ్ర, పైగా తెలంగాణలో కెసిఆర్ గెలిచేసాడు కదా అని అనుకోవద్దు.  అది నిజమే.... కాని మొత్తంగా తెలుగువారి నిర్ణయాన్ని పరిశీలిస్తే మాత్రం మెజారిటి ప్రజలు చంద్రబాబుకే పట్టం కట్టారన్నది మాత్రం అక్షరసత్యం. ఎందుకంటే రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబే, విభజనకు మద్దతిచ్చిన బిజేపితో స్నేహం చేసారంటే అది నిజమే అని ప్రచారం చేసినా కూడా అక్కడ అంటే సీమాంద్రలో ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. అంతే కాదు కంప్లీట్ సమైక్యం అంటూ సీమాంద్రకే పరిమితం అయిన జగన్ ను అక్కడి వారు అంతగా విశ్వసించలేదు.

ఇక చివరి వరకు తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకున్నారు. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసారు. చంద్రబాబు తెలంగాణ ద్రోహి, ఆయనే తెలంగాణ అడ్డుకున్నానని చెప్పారు, ఇక తెలంగాణలో టిడిపి చచ్చిపోయింది. తెలంగాణ జనం చంద్రబాబును దగ్గరికి రానీయరు అన్నారు. ఏమయింది... తెలంగాణ ఇచ్చింది అన్న క్రెడిట్ ఉన్న కాంగ్రెస్ తో సమానంగా తెలంగాణలో టిడిపిని ఆదరించారు. అంటే తెలంగాణలో కూడా చంద్రబాబును కోరుకున్నారు. సీమాంద్ర వారున్న చోట మాత్రమే గెలిచారు అని కొట్టిపారేసే వీలు లేదు. ఎందుకంటే సెటిలర్లు ఎంత ఉన్నా కూడా వారంతా వన్ సైడ్ అయినా కూడా గెలుపునకు అవసరమయ్యేంత ఉండరన్నది వాస్తవం.

ఈ సంగతి పక్కన బెట్టినా  మరో కోణంలో ఆలోచించినా చంద్రబాబే సమైక్యాంధ్ర బాస్. ఎలా అంటే రాష్ట్రం విడిపోకుండా యునైటెడ్ ఆంద్రప్రదేశ్ కు ఎన్నికలు జరిగితే ఇప్పుడు వచ్చిన ఫలితాల ప్రకారం చంద్రబాబే గెలిచేవారు. ఆయన హోల్ ఏపికి సిఎం అయ్యేవారు అంటున్నారు. ఎలా అంటే ముందు ఇప్పుడు వచ్చిన ఫలితాలు పరిశీలిస్తే... ఆయనకు సీమాంద్రలో 102. తెలంగాణలో 15 వచ్చాయి. అంటే ఆయనకు మొత్తం మీద 117 వచ్చినట్టు. హోల్ ఏపిలో అధికారానికి కావాల్సింది 146. అంటే దాదాపుగా దగ్గరకు వచ్చినట్టే. ఇక బిజేపివి పట్టుకుంటే మెజారిటికి చేరువయినట్టే.
 ఈ లెక్కలు విడిపోయాక వచ్చినవి. విడిపోకపోతే పరిస్థితులు వేరేగా ఉండేవి. విడిపోక ముందు ఎంత ఉద్యమం చేసినా, సెంటి మెంటు తీవ్రత ఎంత ఉన్నా కూడా తెలంగాణలో ఇన్ని సీట్లు కేసిఆర్ కు రాలేదు. ఇన్ని సీట్లు కాదు, ఇందులో సగం కూడా టిఆర్ఎస్ సాధించలేదు. పైగా ప్రజల ఆలోచన టోటల్ ఏపిని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. టిఆర్ఎస్ తెలంగాణ అంతటా గెలిపించినా అధికారంలోకి రాడు కాబట్టి ఇప్పుడు ఇచ్చినంత మద్దతు టిఆర్ఎస్ కు యునైటెడ్ ఏపిలో ఇవ్వరన్నది నిజం. పైగా ఉద్యమ సమయంలోను తెలంగాణలో టిఆర్ఎస్, కాంగ్రెస్ ల కంటే టిడిపిదే పై చేయి. అంటే ఇంత తక్కువగా సీట్లు సాధించిన తెలంగాణలో యునైటెడ్ ఏపికి ఎన్నికలు జరిగితే ఇంకా ఎన్నో సీట్లు వచ్చేవి.

ఇక సీమాంధ్రలో పరిశీలిస్తే విభజనకు కారణం అని నిందలు మోపినా అనూహ్య మద్దతిచ్చారు. అంటే అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని ఓటేసారు. ఇక కాంగ్రెస్ కు ఇంత వ్యతిరేకత ఉండేది కాదు కదా అనొచ్చు. నిజమే కాని పదేళ్ల పాలనపై దేశమంతటా ప్రజలిచ్చిన తీర్పే సీమాంద్రలోను జనం ఇచ్చేవారు. తెలంగాణ ఇచ్చినా కూడా అక్కడ కాంగ్రెస్ కు మద్దతివ్వకపోవడానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకతే. ఇక జగన్ అంటారా... ఇప్పుడు వచ్చినవే ఆయన సమైక్యం అన్నందుకు. యునైటెడ్ ఏపికి జరిగితే ఆయనకు ఈ అవకాశమే ఉండేది కాదు. వైఎస్ సానుభూతి ఉప ఎన్నికల వరకే పరిమితం అన్నది కూడా తేలిపోయింది. అప్పుడు గెలిచిన 16 మందిలో ఇప్పుడు 13 మంది ఓటమి పాలవడమే దీనికి నిదర్శనం. అందుకే విడిపోక సమైక్యాంధ్రకు ఎన్నికలు జరిగినా చంద్రబాబే బాస్ అన్న  మాట. ​

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు