సీఎం రమేశ్ కొడుకు నిశ్చితార్థం... ఏపీ రాజకీయాలను మార్చేస్తుందా?

సీఎం రమేశ్ కొడుకు నిశ్చితార్థం... ఏపీ రాజకీయాలను మార్చేస్తుందా?

మొన్నటిదాకా టీడీపీలో కీలక నేతగా ఉండి ఇటీవలే బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తన కుమారుడు రిత్విక్ నిశ్చితార్థం కోసం దుబాయిలో చేసిన భారీ ఏర్పాట్లు... ఏపీ రాజకీయాలను మార్చేస్తాయా? అన్న దిశగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అయినా ఓ పెళ్లి వేడుక... రాజకీయాలనే మార్చేస్తుందా? అంటే... సీఎం రమేశ్ ఇన్వైట్ చేసిన జాబితా చూస్తుంటే... నిజమేనని చెప్పక తప్పదు. రిత్విక్ నిశ్చితార్ధం కోసం పెద్ద సంఖ్యలో నేతలు దుబాయి చెక్కేసిన నేపథ్యంలో ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీతో పాటు... అధికార పార్టీగా మారిన వైసీపీ కూడా టెన్షన్ లో పడిపోయాయన్న వార్తలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సుజనా చౌదరి, మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులతో కలిసి సీఎం రమేశ్ బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత టీడీపీకి చెందిన చాలా మంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని, వారు ఏ క్షణమైనా బీజేపీలో చేరే అవకాశాలున్నాయంటూ ఇటీవలే రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు కొనసాగింపుగా మొన్నటికి మొన్న సుజనా చౌదరి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వైసీపీ ప్రజా ప్రతినిధులు కూడా తమతో కలిసి వచ్చే అవకాశాలున్నాయని సుజనా బాంబులాంటి వార్త పేల్చారు.

ఈ వార్తలు వెలువడిన క్రమంలోనే కుమారుడి నిశ్చితార్ధ వేడుకకు దుబాయిని వేదికగా సీఎం రమేశ్ ఎంపిక చేయడం, ఆ వేడుకకు పార్టీలకు అతీతంగా చాలా మంది ప్రజా ప్రతినిధులను ఆయన ఆహ్వానించడం, అందరూ అక్కడికి వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో సీఎం రమేశ్ వారి కోసం ఏకంగా 17 విమానాలను బుక్ చేయడం ఆసక్తి రేకెత్తించింది. నిశ్చితార్థ వేడుకలో రాజకీయాలకు ఆస్కారం లేదనుకున్నా... ఏకంగా మూడు రోజుల పాటు నేతలు అక్కడే ఉండటం, ప్రస్తుతం బీజేపీ ఆపరేషన్ కమలను యాక్టివ్ గా అమలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతలు బీజేపీలోకి చేరే దిశగా చర్చలు జరుగుతాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీతో పాటు వైసీపీ కీలక నేతలు కూడా సీఎం రమేశ్ కుమారుడి నిశ్చితార్థ వేడుకపై ఓ కన్నేసి ఉంచాయట. చూద్దాం... ఏం జరుగుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English