ట్రాఫిక్ కానిస్టేబుల్ గా మారిన ఎంపీ

ట్రాఫిక్ కానిస్టేబుల్ గా మారిన ఎంపీ

మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారం ఎత్తాడు. మాస్ రాజకీయాలు చేయడంలో జనాలను ఆకట్టుకోవడంలో తమకు మించిన వారు లేరని మరోసారి నిరూపించారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లతో తరచుగా వార్తల్లో ఉండే అసద్ తాజాగా కానిస్టేబుల్ అవతారం ఎత్తి షాక్ ఇచ్చారు. పాత‌బ‌స్తీలోని ఫ‌తే ద‌ర్వాజా చౌర‌స్తాలో వాహ‌నాలు ఇష్టారాజ్యంగా వెళుతున్న వేళ‌లో.. ట్రాఫిక్ జాం అయ్యింది. ఆ సంద‌ర్భంలో ఎంపీ అస‌ద్ చార్మినార్ నుంచి మిస్రాజ్ గంజ్ వైపు వెళుతున్నారు. ట్రాఫిక్ తో అక్క‌డి వారు ఇబ్బందిప‌డుతుంటే.. కారు దిగి.. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయ‌టం షురూ చేశారు.

ఎంపీ అస‌ద్ లాంటోళ్లు రంగంలోకి దిగితే.. ఎంత పెద్ద ట్రాఫిక్ జాం అయినా క్ష‌ణాల్లో కంట్రోల్ లోకి రావ‌టం ఖాయం. తాజాగా అలాంటిదే చోటు చేసుకుంది. అస‌ద్ రోడ్డు మీద‌కు వ‌చ్చి వాహ‌నాల్ని కంట్రోల్ చేయ‌టంతో ట్రాఫిక్ జాం క్లియ‌ర్ అయ్యింది. ట్రాఫిక్ జాం వేళ‌.. ట్రాఫిక్ కానిస్టేబుల్ అవ‌తారం ఎత్తిన ఎంపీ అస‌ద్ తీరును వీడియో తీశారు. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అస‌ద్ చేసిన ప‌నిని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. ఇలా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యంలో మాత్రం అస‌ద్ ను అభినందించాల్సిందే.

అసద్ అప్పుడ‌ప్పుడు మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తుంటారు. ట్విట్టరులో యాక్టివ్ గా ఉంటారు. దేశంలో కీలక సంఘటనలపై తన శైలిలో వ్యాఖ్యలు చేస్తుంటారు. గ‌డిచిన కొంత‌కాలంగా ఆయ‌న త‌న తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మాటల్లో వేడి తగ్గించి కొంచెం నెమ్మదించారు. తాజాగా జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ ఎంపీగా నాలుగోసారి విజ‌యం సాధించారు. ఇది మీకు తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English