షాకింగ్: కవలల్లో ఒక్కొక్కరికి ఒక్కో తండ్రి

షాకింగ్: కవలల్లో ఒక్కొక్కరికి ఒక్కో తండ్రి

ఇది మామూలు షాక్ కాదు. భర్తకు తెలియకుండా వేరే వ్యక్తి ద్వారా గర్భం దాల్చి ఆ తర్వాత పట్టుబడిన సందర్భాలు చాలా జరిగి ఉండొచ్చు. కానీ ఒక మహిళ కవలలకు జన్మనిస్తే అందులో ఒక్కొక్కరు ఒక్కో తండ్రికి పుట్టిన వాళ్లు అయ్యుండటం ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ జరిగి ఉండదు. ఈ విచిత్రం చైనాలో చోటు చేసుకుంది. దీని గురించి ఆ దేశానికి చెందిన స్ట్రెయిట్ హెరాల్ట్ పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. దీని ప్రకారం ఒక మహిళ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఐతే వారిలో ఒకరితో ఒకరికి పోలికే లేదు. ముక్కు, కళ్లు, ముఖం పూర్తి భిన్నంగా కనిపించాయి. కాగా చైనాలో పుట్టిన ప్రతి పిల్లాడికీ పేటర్నిటీ టెస్ట్ చేస్తారు. అందులో డీఎన్ఏ పరీక్షలు కూడా మిళితమై ఉంటాయి. ఆ పరీక్షల్లో ఇద్దరు పిల్లలకు తండ్రి ఒకరు కాదని తేలింది. వేర్వేరు తండ్రుల ద్వారా ఆ ఇద్దరూ జన్మించారని వెల్లడైంది. ఐతే కవలలకు ఇద్దరు తండ్రులు ఎలా ఉంటారన్న ప్రశ్న ఉత్పన్నమైంది.

భర్తతో తనకు విభేదాలున్నాయని.. అతనే పరీక్షల ఫలితాల్ని మార్చేశాడని భార్య ముందు ఆరోపించింది. కానీ విచారణ తర్వాత ఆమె అసలు నిజం ఒప్పుకుంది. గర్భం దాల్చడానికి ముందు తాను వేరే వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నట్లు ఆమె అంగీకరించింది. అయినప్పటికీ వేర్వేరు వ్యక్తుల ద్వారా కవలలకు జన్మనివ్వడం వైద్యులకు కూడా మొదట వింతగానే అనిపించింది. ఐతే ఉన్నత స్థాయి వైద్యులు మాత్రం ఇది సాధ్యమే అని తేల్చారు. ఒక మహిళ ఒకట్రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులతో శృంగారంలో పాల్గొంటే వేర్వేరు వీర్యాల ద్వారా ఇద్దరు పిల్లలకు ఒకేసారి జన్మనివ్వడానికి అవకాశం ఉందని.. ఇది  చాలా చాలా అరుదుగా జరిగే విషయమని వైద్యులు వెల్లడించారు. ఐతే ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వ్యవహారాన్ని ఆ ముగ్గురు ఎలా పరిష్కరించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English