రేపు రేవంత్ రెడ్డి సీఎం కావచ్చు

రేపు  రేవంత్ రెడ్డి  సీఎం కావచ్చు

గులాంనబీ ఆజాద్. గాంధీ కుటుంబానికి వీర విధేయుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత. ఆయ‌న మాట అంటే కాంగ్రెస్ పెద్ద‌ల మాట అనే అనుకోవ‌చ్చు! అలాంటి గులాం న‌బీ ఆజాద్‌  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విష‌యంలో ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మంగ‌ళవారం తెల్లవారుజామున రేవంత్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేయడం కొడంగల్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. కోస్గిలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటామని, సభను జరగనివ్వబోమని రేవంత్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. అనంత‌రం ఆయ‌న్ను వ‌దిలిపెట్టారు.

అయితే, పార్టీ నేత రేవంత్‌రెడ్డిని మంగ‌ళ‌వారం రాత్రి ఆయన నివాస‌మైన‌ కొడంగల్‌ వెళ్లి ఆజాద్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్‌ను అరెస్ట్ చేయించి కొడంగల్‌కు రావడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. సింహాన్ని బోనులో బంధించి అడవిలో తిరగడం గొప్ప కాదని.. సింహాన్ని స్వేచ్ఛగా వదిలేసి తిరగడం గొప్పని అన్నారు.  ఈరోజు సీఎం కుర్చీలో కేసీఆర్ ఉండొచ్చు రేపు సీఎం కుర్చీలో రేవంత్ ఉండొచ్చు అని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

రేవంత్ కుటుంబానికి, తెలంగాణ సమాజానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. కాగా, సీఎం పీఠంపై రేవంత్ అంటూ ఆజాద్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English