పవన్‌కళ్యాణ్‌కి చిరంజీవి సీన్‌ రిపీట్‌

పవన్‌కళ్యాణ్‌కి చిరంజీవి సీన్‌ రిపీట్‌

చిరంజీవికి ఇండస్ట్రీలో చాలా మంది క్లోజ్‌గా వుండేవారు. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరుకి క్లోజ్‌ అయిన వారిలో చాలా మంది అతని వెంట వెళ్లలేదు. కొందరు స్నేహితులయితే చిరంజీవిని సపోర్ట్‌ కూడా చేయకుండా పక్క పార్టీలకి మద్దతు పలికారు.

సినిమా వేరు, రాజకీయం వేరు అని వారంతా చెప్పకనే చెప్పారు. చిరంజీవి పార్టీ పెడితే సగం సినిమా ఇండస్ట్రీ అందులో వుంటుందని భావించిన వారికి రియాలిటీని తెలియజెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ విషయంలో అది డిఫరెంట్‌గా వుంటుందని, చిరుకి అభిమానులుంటే, పవన్‌కి భక్తులున్నారని, కనుక పవన్‌ ఏది చెబితే అదే వేదంగా, అతని వెన్నంటే అంతా వుంటారని అనుకున్నారు.
కానీ పవన్‌ పేరు చెబితేనే పూనకం వచ్చినట్టు ఊగిపోతూ భజన చేసేసే బండ్ల గణేష్‌ కూడా జనసేనలో చేరకుండా కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయాడు. పవన్‌ అంటే ఇప్పటికీ ఇష్టమేనని, కానీ పార్టీ పరంగా కాంగ్రెస్‌ ఇష్టమని, పవన్‌ని మాత్రం ఎప్పటికీ విమర్శించనని గణేష్‌ చెప్పుకొచ్చాడు.

పవన్‌పై పలువురు విమర్శలు చేస్తున్నపుడు అతని భక్తులుగా చెప్పుకునే వారిలో చాలా మంది స్పందించలేదు. నితిన్‌ లాంటి ఏ కొందరో పవన్‌ పట్ల అభిమానం చాటుకున్నా కానీ రాజకీయంగా ఎలాంటి మద్దతు తెలపరనేది క్లియర్‌. పవర్‌లో వున్న పార్టీకయినా, అపార అనుభవం వున్న పార్టీలకయినా ఆకర్షణ శక్తి వుంటుంది కానీ అపుడే పుట్టిన పార్టీలకి లీడర్‌ ఎవరైనా కానీ అయస్కాంత శక్తి మాత్రం వుండదని ఇంతకంటే క్లియర్‌గా చెప్పాలంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు