ములాయం జగన్ ను దరిచేర్చుకుంటారా?

ములాయం జగన్ ను దరిచేర్చుకుంటారా?

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కోసం జాతీయ పార్టీల మద్దతు కూడగడుతాను అంటూ జగన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలను కలవడాని వెళ్లారు. ఆర్టికల్ 3 సవరణకు నడుం కట్టాలని, అందరు కలిసి రావాలని, పార్లమెంట్ ఏపి విభజన బిల్లును అడ్డుకోవాలని కోరడానికే వెళుతున్నాను అని జగన్ చెపుతున్నప్పటికి నిజానికి ఈ భేటి వెనుక రాబోయే ఎన్నికల రీత్యా రాజకీయ ప్రయోజనాలు వుండనే వున్నాయి.

జగన్ మూడో ఫ్రంట్ వైపు కన్నేసాడని, దానితోనే కలిసిపోతాడన్న వార్తలు లేటెస్టుగా వినిపిస్తున్నాయి. మూడో ఫ్రంట్ లో అత్యంత కీలకమైన ములాయం, మమతా బెనర్జీ. అందుకోసమే ఆయన వారిని కలుస్తున్నాడు అన్నది స్పష్టం. అయితే ములాయం జగన్ ను ఎంత వరకు దరిచేర్చుకుంటాడు అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

గతంలో ఓసారి ధర్డ్ ఫ్రంట్ లోకి రావాలని ములాయం చంద్రబాబును కోరగా, హైదరాబాద్ కు వచ్చిన ఆయన కుమారుడు  యూపి సిఎం అఖిలేష్ మాత్రం జగన్ ను కలిసి మాట్లాడారు. దీంతో ధర్డ్ ఫ్రంట్ కు చంద్రబాబును బదులు ఏపి నుంచి జగన్ ను ఆహ్వానిస్తున్నారు అన్న వార్తలు షికారు చేసాయి. అయితే అఖిలేష్ ఎంపీ గా ఉన్నప్పుడు పార్లమెంట్ లో జగన్, అఖిలేష్ పక్కపక్కనే కూర్చునే వారని ఆ పరిచయం కారణంగా అఖిలేష్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు జగన్ ను కలిసారే తప్ప ధర్డ్ ఫ్రంట్ సమీకరణల్లో భాగంగా కాదని ఆ తరువాత వార్తలు వినవచ్చాయి.  హైదరాబాద్ కు వచ్చిన అఖిలేష్ జగన్ నే కాకుండా కేంద్రమంత్రి చిరంజీవిని కూడా ఆయన ఇంటికి వెళ్లి కలిసారు. దీంతో ఆ హడావుడి అప్పటితో సద్దుమణిగింది.

నిజానికి థర్డ్ ఫ్రంట్ సమీకరణలో అఖిలేష్ కన్నా ఆయన తండ్రి ములాయమే అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారు. అందుకే ఆ విషయంలో ములాయం నిర్ణయమే కీలకం, అందుకే జగన్ అఖిలేష్ ను కలిసినా ప్రయోజనం ఉండదన్న వాదన వినిపిస్తోంది. పైగా ఇతర సమీకరణలు కూడా దీనికి బలాన్నిస్తున్నాయి. ములాయం కు దగ్గరైన వ్యాపార వర్గాలతో చంద్రబాబుకు, ఇతర రాష్ట్ర తెలుగుదేశం ప్రముఖులకు సంబంధాలున్నాయి. వీటి ప్రభావం జగన్-ములాయం అంశాలపై వుంటుంది. పైగా ములాయం మాట నిలకడ వున్న రాజకీయనాయకుడు కాదు. ఇప్పటికి యుపిఎ పై రోజుకో తీరుగా మాట్లాడుతుంటారు. కేంద్రంలో తమ అవసరాలకు అనుగణంగా ములాయం రాజకీయాలు మారుతుంటాయి. అలాంటి వ్యక్తి జగన్ తో పొత్తు ప్రకటించినా, అది కొస నెగ్గుతుందని అనుకోవడానికి లేదు.​

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English