అతి త్వ‌ర‌లో ప‌వ‌న్ పొలిటిక‌ల్ షెడ్యూల్ రిలీజ్‌!

అతి త్వ‌ర‌లో ప‌వ‌న్ పొలిటిక‌ల్ షెడ్యూల్ రిలీజ్‌!

జ‌నంలోకి వెళ‌తానంటూ ఊరిస్తున్న జ‌న‌సేనాధిప‌తి.. ఎప్ప‌టికప్పుడు త‌న షెడ్యూల్ ను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న వైనం తెలిసిందే. అదిగ‌దిగో అంటూ ముచ్చ‌ట‌గా మూడు నెల‌ల క్రితం ఆయ‌న జ‌నంలోకి వ‌చ్చి మాట్లాడారు. ఇంకేముంది.. సెప్టెంబ‌రు వ‌చ్చిందంటే చాలు.. జ‌నంలోకి రావ‌ట‌మే త‌రువాయి అన్న‌ట్లుగా ప‌వ‌న్ మాట‌లు చెప్పారు. కానీ.. సెప్టెంబ‌రు వెళ్లిపోయి.. అక్టోబ‌రు చివ‌ర‌కు వ‌చ్చేసింది. అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తార‌న్న‌ది ఇప్ప‌టివ‌ర‌కూ క్లారిటీ రాలేదు.

సొంత ప‌నుల‌తో హ‌డావుడిలో ఉన్న ప‌వ‌న్‌.. జ‌నం మీద దృష్టి సారించేది ఎప్పుడున్న సందేహం ప‌లువురిని ప‌ట్టిపీడిస్తోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్రకారం.. ప‌వ‌న్ పొలిటిక‌ల్ షెడ్యూల్ దాదాపుగా క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఆదివారం పార్టీ ముఖ్యుల‌తో భేటీ పెట్టుకున్న ప‌వ‌న్‌.. రానున్న రోజుల్లో త‌న ఆర్నెల్ల షెడ్యూల్ పై సుదీర్ఘంగా మాట్లాడిన‌ట్లుగా తెలుస్తోంది.

పార్టీ ప‌రంగా సంస్థాగ‌తంగా ఇప్ప‌టికే ఒక సెట‌ప్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. పార్టీ అంత‌ర్గ‌త నిర్మాణంతో పాటు.. ప్ర‌జ‌ల్లోకి మ‌రింత చొచ్చుకుపోయేలా పార్టీని న‌డిపించాల‌న్న‌ది ప‌వ‌న్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు.. పార్టీ ప్లీన‌రీతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న మీద స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

అన్ని అనుకున్న‌ట్లుగా జ‌రిగితే.. న‌వంబ‌రు రెండో వారం నుంచి ప‌వ‌న్ పొలిటిక‌ల్ షెడ్యూల్ సిద్ధ‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఒక‌వేళ అనుకోని అవాంతరం ఏదైనా ఎదురైతే.. డిసెంబ‌రు నుంచి మాత్రం క‌చ్ఛితంగా క్రియాశీల రాజ‌కీయాల్లో చురుగ్గా ప‌వ‌న్ పాల్గొంటార‌ని తెలుస్తోంది. కాస్త ఆల‌స్య‌మైనా ఫ‌ర్లేదు కానీ.. ఒక‌సారి మొద‌లు పెడితే.. కంటిన్యూగా కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించాల‌ని.. మ‌ధ్య‌లో బ్రేకులు అన్న‌వి ఉండ‌కూడ‌ద‌న్న‌ది ప‌వ‌న్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. పార్టీలో ఉత్సాహాన్ని పెంచ‌టంతో పాటు.. కార్య‌క‌ర్త‌ల్లో కొత్త ఊపు తీసుకొచ్చేలా కార్య‌క్ర‌మాల వ్యూహాన్ని సిద్దం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.షెడ్యూల్‌ను ఒక కొలిక్కి తీసుకొచ్చినా.. కొన్ని మార్పులు చేర్పులు ప‌వ‌న్ సూచించిన‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. రానున్న ఒక‌ట్రెండు నెల‌ల్లో ప్ర‌జ‌ల్లోకి ప‌వ‌న్ రావ‌టం ప‌క్కా అని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు