పవర్‌స్టార్‌కి అదేమి టైటిలండీ!

పవర్‌స్టార్‌కి అదేమి టైటిలండీ!

 పవన్‌కళ్యాణ్‌తో తీయబోయే ‘గబ్బర్‌సింగ్‌ 2’ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని సంపత్‌ నంది చాలా మాటలు చెబుతున్నాడు. రచ్చతో హిట్టు కొట్టినా కానీ ఎందుకో అతని సామర్ధ్యంపై ఇంకా అనుమానాలు అలాగే ఉన్నాయి. అందునా గబ్బర్‌సింగ్‌లాంటి క్యారెక్టర్‌ని అతను అంతే పదునుగా డీల్‌ చేయగలడా అనే సందేహాలకి ఫుల్‌స్టాప్‌ పడడం లేదు. కానీ సంపత్‌ నంది మాత్రం ఈ సినిమాని గబ్బర్‌సింగ్‌ని మించిన దానిని చేస్తానని ధీమాగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ‘బెంగాల్‌ టైగర్‌’ అనే టైటిల్‌ పెట్టాలని సంపత్‌ నంది అనుకుంటున్నాడట. పవన్‌కి ఆ టైటిల్‌ అయితే యాప్ట్‌గా ఉంటుందని అతను ఫీలవుతున్నాడు. అయితే గబ్బర్‌సింగ్‌ సీక్వెల్‌కి ఈ టైటిల్‌ ఏంటీ... అస్సలు బాగోదు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ‘రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ సిద్ధూ సిద్ధార్థ్‌ రాయ్‌’ అంటూ పవన్‌ హల్‌చల్‌ చేసిన సీన్‌ గుర్తుకి తెస్తున్నా కానీ ఆ టైటిల్‌ పెడితే సినిమా ఎక్కువ మందికి చేరదని ఫాన్స్‌ కంగారు పడుతున్నారు.

 అయితే ఈ సినిమాకి సంబంధించి ఏదైనా ఫైనల్‌ కాల్‌ పవన్‌కళ్యాణ్‌దే కాబట్టి సంపత్‌ నంది మదిలో ఎన్ని టైటిల్స్‌ ఉన్నా అల్టిమేట్‌గా టైటిల్‌ ఫిక్స్‌ చేసేది పవన్‌ కళ్యాణే. గబ్బర్‌సింగ్‌ టైటిల్‌ సజెస్ట్‌ చేసిన పవన్‌ ఇప్పుడు దాని సీక్వెల్‌కి బెంగాల్‌ టైగర్‌ అనే పేరు ఖాయం చేస్తాడని అనుకోలేం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English