బెల్లంకొండ రూట్‌ మార్చేసాడు

బెల్లంకొండ రూట్‌ మార్చేసాడు

నిన్న మొన్నటి వరకు యాక్షన్‌ సినిమాలంటూ మాస్‌ చిత్రాలు చేసి చేతులు కాల్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ 'రాక్షసుడు' తర్వాత రూట్‌ మార్చేసాడు. ఇక రొటీన్‌ కథలు చేయకూడదని ఫిక్స్‌ అయిపోయాడు. రాక్షసుడు మాదిరిగా థ్రిల్లర్స్‌ లేదా కాన్సెప్ట్‌ బేస్డ్‌ క్యారెక్టర్స్‌ చేయాలని చూస్తున్నాడు.

ఇంతకుముందు చేతికి వచ్చిన కథనల్లా ఓకే చేస్తూ పోయిన బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ పదుల కొద్దీ కథలు వింటున్నాడు. ఎన్ని కథలు విన్నా కానీ రాజీ పడిపోయి ఏదో ఒక సినిమా చేసేయడం కాకుండా నిజంగా దమ్మున్న కథ దొరికితేనే చేయాలని చూస్తున్నాడు. అసలే ఇప్పుడు తన స్థాయి సినిమాలు చేసే హీరోలు చాలా మంది వుండడంతో, అందరూ వెరైటీ చిత్రాలంటూ రెగ్యులర్‌ పాత్రలకి దూరంగా వుంటూ వుండడంతో బెల్లంకొండపై కూడా ఒత్తిడి పెరిగింది.

ఇంతకుముందులా స్టార్‌ డైరెక్టర్లతోనే చేయాలంటూ ఎదురు చూడకుండా మంచి కథతో వచ్చిన కొత్త దర్శకులకి కూడా వెల్‌కమ్‌ చెబుతున్నాడు. బెల్లంకొండకి వున్న హిందీ డబ్బింగ్‌ మార్కెట్‌ వల్ల నిర్మాతలకి కొదువ లేదు. అతనితో సినిమా చేయడానికి ఎప్పుడయినా నిర్మాత రెడీగానే వుంటాడు. కాకపోతే ఈ మార్కెట్‌ పడిపోకుండా చూసుకోవడం మాత్రం తన చేతుల్లోనే వుందని తెలుసుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English