కేజీఎఫ్-2 రేంజ్ ఏంటో అర్థమైపోలా..

కేజీఎఫ్-2 రేంజ్ ఏంటో అర్థమైపోలా..

సంజయ్ దత్ అనేవాడికి బాలీవుడ్లోనే బంపర్ క్రేజుంది. ఓ దక్షిణాది సినిమాలో నటించమని అడిగితే ఒప్పుకుంటాడని ఎవ్వరూ అనుకోరు. అందులోనూ ఇక్కడ నెగెటివ్ రోల్ చేయమని అంటే సంజయ్ అంగీకరించడం చిన్న విషయం కాదు.

కానీ ‘కేజీఎఫ్’ సినిమా హిందీలో ఎంతటి సంచలనం సృష్టించిందో సంజయ్‌కి బాగానే తెలిసినట్లుంది. దీని సీక్వెల్లో నటిస్తే దక్షిణాదిన సూపర్ పాపులారిటీ సంపాదించవచ్చని.. తన హిందీ సినిమాలకు కూడా బాగా కలిసొస్తుందని భావించే ‘కేజీఎఫ్-ఛాప్టర్ 2’లో నటించినట్లున్నాడు సంజయ్. బాబా ఈ సినిమాలో నటించడం నిజమైనపుడు.. రవీనా టాండన్ మరో ముఖ్య పాత్రలో నటించనుండటం కూడా వాస్తవమే అనుకోవాలి.

పెద్దగా అంచనాలు లేనపుడే ‘కేజీఎఫ్’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంచనాల్ని మించిపోయి అన్ని చోట్లా బ్లాక్‌బస్టర్ అయింది. ముఖ్యంగా ఈ చిత్రం ఉత్తరాదిన భారీ వసూళ్లు సాధించడమే అత్యంత ఆశ్చర్యకర విషయం. ఇప్పుడు దాని సీక్వెల్ మీద అన్ని చోట్లా భారీ అంచనాలున్నాయి.

‘కేజీఎఫ్’లో విలన్ ఎవరన్నది కూడా తెలియనపుడే జనాలు అధీర పాత్రకు భలే కనెక్టయిపోయారు. ఇక ఆ పాత్రలో సంజయ్ దత్ లాంటి నటుడు కనిపిస్తే ఎంత థ్రిల్ కలుగుతుందో.. సంజు కోసం ఆ పాత్రను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంకెంత బాగా తీర్చిదిద్ది ఉంటాడో తలుచుకుంటే ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో చెప్పాల్సిన పని లేదు. ‘బాహుబలి-2’ కాకుండా ఇండియాలో ఒక సీక్వెల్‌కు ఇంత క్రేజ్ ఇంతకుముందెప్పుడూ చూసి ఉండమేమో. మరి ‘కేజీఎఫ్-2’ ఈ అంచనాల్ని ఏమేరకు అందుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English