దేవరకొండతో రొమాన్స్.. రష్మిక రెస్పాన్స్

దేవరకొండతో రొమాన్స్.. రష్మిక రెస్పాన్స్

విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నా కెమిస్ట్రీనే వేరు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ వీళ్లిద్దరి జోడీ భలేగా ఉంటుంది. ‘గీత గోవిందం’ అంచనాల్ని మించి అంత పెద్ద విజయం సాధించిందంటే అందుకు విజయ్, రష్మికల కెమిస్ట్రీ ఒక ముఖ్య కారణం అనడంలో సందేహం లేదు.

ఇప్పుడు ఈ జోడీ ‘డియర్ కామ్రేడ్’తో వస్తోంది. దీని ప్రోమోల్లోనూ విజయ్, రష్మిక జోడీ భలే అందంగా ఉంది. సినిమాలో వీరి కలయికలో వచ్చే సన్నివేశాలు హైలైట్ అయ్యేలా ఉన్నాయి. బయట ప్రమోషన్లలో కూడా ఇద్దరూ భలే కోఆర్డినేషన్‌తో వ్యవహరిస్తుంటారు. పరస్పరం పంచులు వేసుకుంటూ ఉంటారు.

సోషల్ మీడియాలో కూడా పరస్పరం స్పందించే తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కెమిస్ట్రీకి తోడు విజయ్‌తో ‘గీత గోవిందం’ మొదలైన కొంత కాలానికే రష్మిక.. తన ఫియాన్సీ రక్షిత్ నుంచి విడిపోయిన నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ ఉందన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఐతే ‘డియర్ కామ్రేడ్’ ప్రమోషన్ల కోసం చెన్నై వెళ్లిన రష్మిక అక్కడ ఒక తమిళ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడింది. విజయ్‌తో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, తమ ఇద్దరిదీ మంచి జోడీ అని అంది. తమ మధ్య ఏదో ఉందని జనాలు అనుకుంటున్నారు అంటే.. అందుక్కారణం తెరమీద తమ కెమిస్ట్రీ అంత బాగా పండుతోందని అర్థం అని చెప్పింది.

ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే తాము సక్సెస్ అయినట్లే అంది. అయితే తాము ప్రొఫెషనల్స్ అని.. తమ దృష్టంతా పాత్రల్ని పండించడం మీదే ఉంటుందని.. అందుకోసమే ఏమైనా చేస్తామని చెప్పింది రష్మిక. ప్రస్తుతం తాను కార్తితో సినిమా చేస్తున్నానని.. ఆయనతో కూడా కెమిస్ట్రీ వర్కవుట్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని.. ఒకవేళ అది బాగుంటే ఆయనతో కూడా ఎఫైర్ అని అంటారా అని రష్మిక ప్రశ్నించింది. ఇలాంటి రూమర్లను తాము చాలా తేలిగ్గా తీసుకుంటామని ఆమె అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English