అజ్ఞాతవాసి బయటకొచ్చాడు!

అజ్ఞాతవాసి బయటకొచ్చాడు!

హీరోగా మంచి ఫామ్‌లో వున్న రోజుల్లో ఏడాదికి కనీసం రెండు సినిమాలయినా చేసిన గోపీచంద్‌కి ఇప్పుడు సినిమాలు బాగా తగ్గిపోయాయి. యాక్షన్‌ సినిమాలకి కాలం చెల్లిపోవడంతో ఎలాంటి సినిమాలు చేయాలనే దానిపై గోపీచంద్‌ని గైడ్‌ చేసేవాళ్లు లేకపోయారు. వరుస పరాజయాలతో మార్కెట్‌ మొత్తం దెబ్బ తినడంతో గోపీచంద్‌ సినిమాలు సకాలంలో పూర్తయి, విడుదల కావడం కూడా గగనమైపోతోంది. పంతం చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న గోపీచంద్‌కి దాంతోను పరాభవం తప్పలేదు.

ఆ తర్వాత తమిళ దర్శకుడితో ఒక సినిమా మొదలు పెట్టాడు కానీ దాని ప్రోగ్రెస్‌ ఏమిటనేది ఎవరికీ తెలియదు. షూటింగ్‌లో గాయపడ్డ కారణంగా ఆ చిత్రం ఇంతకాలం ఆగిపోయిందట. గోపీ కోలుకున్నాడని, విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ యాక్షన్‌లోకి దిగడానికి సిద్ధంగా వున్నాడని సమాచారం. దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన గోపీచంద్‌ ఈ చిత్రంతో అయినా తిరిగి మునుపటి వైభవం వస్తుందని ఆశిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే రెండు, మూడు నెలలలో పూర్తి చేసి సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో విడుదల చేస్తారు. ఈ చిత్రంలో మెహ్రీన్‌, జరీన్‌ ఖాన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English