సీత కోసం ఎగబడిపోతున్నారు

సీత కోసం ఎగబడిపోతున్నారు

ఒక సినిమాపై వున్న క్రేజ్‌ ఎంత అనే దానికి కొలమానం ఆ చిత్రం వీడియోలకి వచ్చే వ్యూస్‌ చెబుతాయి. స్టార్‌ హీరోల సినిమాలకి ఏమి పెట్టినా కానీ జనాదరణ లభిస్తుంది. ఆయా హీరోల అభిమానులే సదరు వీడియోలని మళ్లీ మళ్లీ చూసేసి వ్యూస్‌ ఇచ్చేస్తుంటారు. కానీ చిన్న సినిమాలకి ప్రతి వీడియోకీ ఆదరణ రావడమనేది అంత ఈజీ కాదు. కానీ 'సీత' చిత్రానికి సంబంధించి ఏ వీడియో పెట్టినా కానీ బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తోంది. టీజర్‌కి నాలుగు మిలియన్ల వ్యూస్‌ వస్తే, బుల్‌రెడ్డి అనే పాట వీడియోకి కూడా దాదాపు రెండు మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. తాజాగా ట్రెయిలర్‌ రెండు రోజుల్లోనే రెండు మిలియన్లు దాటి ఇప్పటికీ నంబర్‌ వన్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది.

ఈ ట్రెయిలర్‌లో రెగ్యులర్‌ సినిమాల స్టఫ్‌ కాకుండా అవాక్కయ్యే రీతిన కొన్ని డైలాగులని పెట్టిన తేజ తన 'సీత' అందరి దృష్టిని ఆకర్షించేలా చూసుకున్నాడు. కాజల్‌, సోనూ సూద్‌ క్యారెక్టర్లు చాలా కొత్తగా అనిపించడం, బెల్లంకొండ శ్రీనివాస్‌ కూడా రొటీన్‌కి భిన్నంగా కనిపించడం సీతకి క్రేజ్‌ తెచ్చిపెట్టాయి. ఇంతగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న 'సీత' ఈ పాజిటివ్‌ బజ్‌తో పాటు పాజిటివ్‌ టాక్‌ కూడా తెచ్చుకుంటే కలక్షన్ల పరంగా జాతర జరుగుతుందని ఫిక్స్‌ అయిపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English