సైరా సెట్ గురించి అనుమానాలు విన్నారా!

సైరా సెట్ గురించి అనుమానాలు విన్నారా!

ఓ రెండ్రోజుల క్రిందట సైరా సెట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుని.. దాదాపు 3 కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ అగ్నిప్రమాదం గురించి ఒక ప్రముఖ ఆంగ్లపత్రిక ప్రచురించిన కథనం ఒకటం సంచలనాలకు దారితీస్తోంది. అసలు అది ప్రమాదం కాదంటూ కామెంట్లు వినిపిస్తున్నాయిన సదరు పేపర్ ఒక రూమర్ ప్రచురించడంతో తెలుగు సినిమా అభిమానులు షాకైపోయారు.

నిజానికి ఇన్సూరెన్స్ కోసం సదరు సెట్ ను కాల్చేశారని.. చాలామంది పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నవారు తమకు నష్టాలు వస్తున్న తరుణంలో ఫ్యాక్టరీలలో అగ్నిప్రమాదాలు వంటివి క్రియేట్ చేసి ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేస్తారని.. ఇప్పుడు సైరా మేకర్స్ కూడా అదే చేశారనేది సదరు వార్త సారాంశం. అక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, అసలు అలాంటి సంఘటన జరిగేందుకు అక్కడ అవకాశం లేదని, ఇదేదో కావాలనే చేసినపనంటూ సదరు పత్రిక పేర్కొంది.

అంతా బాగానే ఉంది కాని, రామ్ చరణ్‌ వంటి మెగా రిచ్ ప్రొడ్యూసర్ కు ఒక సెట్ ను తగలెట్టేసి ఇన్సూరెన్స్ క్లయిమ్ చేసుకోవాల్సిన అంత అవసరం ఉంటుందంటారా? పైగా అదేమీ వందల కోట్లు కాదు.. కేవలం 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ కోసం నిజంగానే అంత పనిచేస్తారా? చెయ్యరనే సినిమా లవ్వర్స్ నమ్మకం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English