విజయ్ దేవరకొండ.. ఒక చక్కటి బిజినెస్‌మ్యాన్

విజయ్ దేవరకొండ.. ఒక చక్కటి బిజినెస్‌మ్యాన్

విజయ్ దేవరకొండ మంచి నటుడే కాదు.. చక్కటి బిజినెస్ మ్యాన్ కూడా. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది. తన సినిమాల్ని అతను ప్రమోట్ చేసే, మార్కెట్ చేసే తీరే వేరుగా ఉంటుంది. యూత్‌కు బాగా కనెక్టయ్యేలా తనదైన శైలిలో ప్రమోషన్లు చేస్తూ సినిమాను వాళ్లలోకి ఇంజెక్ట్ చేస్తుంటాడతను. ఇక ప్రత్యేకంగా లక్షలు, కోట్లు పెట్టి యాడ్స్ ఏమీ చేయకుండానే తన ‘రౌడీ’ బ్రాండును అతను జనాల్లోకి తీసుకెళ్లిన తీరు కూడా అనూహ్యమే. ఇప్పుడు తన ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న తొలి సినిమాను కూడా భలేగా మార్కెట్ చేసుకుని తనొక నిఖార్సయిన బిజినెస్‌మ్యాన్ అని మరోసారి రుజువు చేసుకున్నాడు. ‘కింగ్ ఆఫ్ ద హిల్’ పేరుతో అతను ఇప్పటికే ఒక నిర్మాణ సంస్థను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ‘నోటా’లో ఆ సంస్థకు భాగస్వామ్యం ఉంది. కానీ ఆ చిత్రం పోయింది.

ఐతే ఈసారి విజయ్ ఫుల్ లెంగ్త్‌లో ప్రొడక్షన్లోకి దిగుతున్నాడు. అతడి సంస్థలో తెరకెక్కుతున్న సినిమాలో ‘పెళ్ళిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్నాడు. ఒక కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి హోల్ అండ్ సోల్ ప్రొడ్యూసర్ విజయే. అతడి తండ్రి నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఐతే సినిమా ఇంకా ఆరంభ దశలో ఉండగానే ఈ చిత్రానికి బిజినెస్ క్లోజ్ చేసి పడేశాడట విజయ్. అతడి కెరీర్‌ను మలుపు తిప్పిన ‘అర్జున్ రెడ్డి’ని విడుదలకు ముందే కొనేసి భారీ స్థాయిలో రిలీజ్ చేసిన ఆషియన్ సినిమాస్ సంస్థ.. నిర్మాతగా విజయ్ తొలి సినిమాను ఫ్యాన్సీ రేటుకు కొనేసిందట. ఈ మేరకు విజయ్ తండ్రి, ఏషియన్ సునీల్ మధ్య డీల్ జరుగుతున్నప్పటి ఫొటో కూడా బయటికి వచ్చింది. దీన్ని బట్టి నిర్మాతగా విజయ్ ఎంత సక్సెస్ ఫుల్ అనేది అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English