ఎన్టీఆర్‌ కంటే గొప్పదా ఏంటి?

ఎన్టీఆర్‌ కంటే గొప్పదా ఏంటి?

వేలం వెర్రి అనే మాటకి అర్థం ఏమిటనేది చూపెడుతున్నారు 'జయలలిత' బయోపిక్‌ మేకర్లు. ఇటీవలే చనిపోయిన తమిళ 'అమ్మ' జయలలిత కథని తెరకెక్కించడానికి ఇప్పటికి చాలా మంది తలపెట్టారు. పలువురి చిత్రాలు వివిధ దశల్లో వుండగా, మళ్లీ కంగన రనౌత్‌తో ఏ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో మరో చిత్రాన్ని అనౌన్స్‌ చేసారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ నిర్మాతలలో ఒకరైన విష్ణు ఇందూరి ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు. జయలలిత పాత్రకి ఒక సినిమాలో విద్యాబాలన్‌, మరో చిత్రంలో నిత్యామీనన్‌ ఎంపికయితే, ఆహార్యంలో జయలలితకి ఏమాత్రం పోలిక లేని కంగన రనౌత్‌ ఎంపిక ఆశ్చర్యపరుస్తోంది.

సినిమాలే కాకుండా జయలలిత జీవితంపై వెబ్‌ సిరీస్‌లు కూడా కార్యాచరణలో వున్నాయి. ఒకే కథని ఇంతమంది ఎందుకు తెరకెక్కిస్తున్నట్టు? గతంలో భగత్‌సింగ్‌ కథని హిందీలో ఇలాగే ముగ్గురు తీసి దాదాపుగా ఒకే సమయంలో విడుదల చేసారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ పట్ల కూడా ఎవరూ ఇంతగా పోటీ పడలేదు. ఎమ్జీఆర్‌ కథని తీయాలనే ఆలోచన ఇంకా ఎవరూ చేయడం లేదు. మరి వారి కంటే జయలలిత ఎందులో గొప్ప? ఆమె ఇటీవలే మరణించడం వల్ల, ఆమె జీవితంలో వివాదాలు బాగానే వుండడం వల్ల ఈ చిత్రంలో కమర్షియల్‌ స్కోప్‌ ఎక్కువ వుందని భావిస్తున్నట్టున్నారు. అయితే ఒక బయోపిక్‌ని చూసేందుకు జనం అంతగా ఆసక్తి చూపించడం లేదీమధ్య. ఇక ఇంతమంది తీస్తే ఎవరి చిత్రానికి ఆదరణ లభిస్తుందో, ఎవరి చిత్రం అధోగతి పాలవుతుందా అనేదే అసలు సమస్య.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English