ఆర్ఆర్ఆర్.. టైటిల్స్ వెల్లువ

ఆర్ఆర్ఆర్.. టైటిల్స్ వెల్లువ

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి రూపొందిస్తున్న కొత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’ అనేది వర్కింగ్ టైటిల్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హీరోలిద్దరితో పాటు దర్శకుడి పేరు కూడా కలిసొచ్చేలా దీనికి ‘ఆర్ఆర్ఆర్’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఆ పేరుతోనే సినిమాను సంబోధిస్తున్నారు. ఐతే ఇది బాగా పాపులర్ కావడంతోో ఆ అక్షరాలు కలిసొచ్చేలాగే పేరు నిర్ణయించాలని రాజమౌళి ఫిక్సయ్యాడు. ఈ విషయాన్ని ఇటీవలి ప్రెస్ మీట్లో కూడా స్పష్టం చేశాడు.

తాము ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ అక్షరాలకు అనుగుణంగా వివిధ భాషలకు టైటిళ్లు అనుకున్నామని.. ఐతే వాటి కంటే మెరుగైన టైటిళ్లు ప్రేక్షకులు సూచించవచ్చంటూ జక్కన్న పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అప్పీల్‌కు మంచి స్పందనే వస్తున్నట్లు సమాచారం. చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఈ విషయమై స్పందించింది. అభిమానుల నుంచి బోలెడన్న టైటిల్స్ వస్తున్నాయని.. ఇలాగే మరిన్ని టైటిళ్లు పంపాలని ఈ సంస్థ ట్విట్టర్లో పిలుపు ఇచ్చింది.
కాగా ‘ఆర్ఆర్ఆర్ టైటిల్’ అనే హ్యాష్ ట్యాగ్ కింద కొన్ని ఆసక్తికర టైటిళ్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ‘రామ రాజుల రణం’, ‘రణ రంగ రారాజులు’, ‘రఘుపతి రాఘవ రాజారాం’, రౌద్ర రణరంగం’, ‘రామ రాజుల రాజసం’ ఇలా ఎన్నో టైటిల్స్‌ను నెటిజన్లు పోస్ట్‌ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని టైటిళ్లను చిత్ర బృందం పరిశీలించి మోస్ట్ సూటబుల్, అట్రాక్టివ్ టైటిల్‌ను ఖరారు చేయనుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, తారక్‌ కొమురం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నట్లు రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English