20 ఏళ్ల తర్వాత ఆ సినిమా రీమేక్

20 ఏళ్ల తర్వాత ఆ సినిమా రీమేక్

ఒక భాషలో హిట్ అయిన సినిమాను రీమేక్ చేయాలనుకుంటే సాధారణంగా అది ఒకట్రెండు ఏళ్లలోనే జరిగిపోతుంటుంది. కొంచెం లేటుగా రీమేక్ ఆలోచన వచ్చినా.. మూణ్నాలుగేళ్ల ముందు వచ్చిన సినిమాల్నే ఎంచుకుంటూ ఉంటారు. కానీ 20 ఏళ్ల కిందట వచ్చిన ఓ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేయాలనుకోవడం ఆశ్చర్యకరమే. రెండు దశాబ్దాల ముందు వచ్చిన సినిమా అంటే దాని కథాకథనాలు ఎలా ఉంటాయో చెప్పేదేముంది? అప్పటి ట్రెండు.. ప్రస్తుత ట్రెండు పూర్తి భిన్నంగా ఉంటాయి.

ఎంత మోడర్నైజ్ చేసినా.. మార్పులు చేర్పులు చేసినా కూడా ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా పాత కథల్ని తీర్చిదిద్దడం కష్టమే. కానీ బాలీవుడ్ జనాలు మాత్రం ఇవేమీ ఆలోచించరు. సౌత్‌లో వచ్చిన ఎప్పటెప్పటి సినిమాల్నో ఇప్పుడు పట్టుకెళ్లి రీమేక్ చేస్తుంటారు. దశాబ్దంన్నర కిందట వచ్చిన ‘ఠాగూర్’ లాంటి సినిమాల్ని అక్కడి వాళ్లు రీమేక్ చేయడం తెలిసిన సంగతే.

ఇప్పుడు 20 ఏళ్ల కిందటి సినిమాను హిందీలో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కెరీర్లో పెద్ద హిట్‌గా నిలిచిన ‘కూలీ నంబర్ వన్’ను హిందీలో తీయబోతున్నారట. వరుణ్ ధావన్ ఇందులో కథానాయకుడిగా నటిస్తాడట. అతడి తండ్రి, నిన్నటి తరం దర్శకుడు డేవిడ్ ధావన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఆయనే దర్శకత్వం వహిస్తాడు కూడా. సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్.. టబు పాత్రను పోషించబోతోంది.

ఇంతకుముందు డేవిడ్ ధావన్ తెలుగు బ్లాక్ బస్టర్ ‘హలో బ్రదర్’ను హిందీలో ‘జుడ్వా’ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. దాదాపు అదే కథను కొంచెం అటు ఇటు మార్చి కొడుకుతో ‘జుడ్వా-2’ చేశాడు. అది హిట్టయింది. దీంతో మరోసారి పాత కథను రీసైకిల్ చేయడానికి రెడీ అయ్యాడు. వరుస హిట్లతో దూసుకెళ్తున్న వరుణ్.. బాలీవుడ్లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English