‘ఎఫ్-2’ను తీయించగలవా?

‘ఎఫ్-2’ను తీయించగలవా?

ఎప్పుడో ఐదు వారాల కిందట విడుదలైన సినిమా ‘ఎఫ్-2’. సంక్రాంతి రేసులో చివరగా వచ్చిన ఈ చిత్రం పోటీలో ఉన్న సినిమాలన్నింటినీ చిత్తు కింద కొట్టేసి బాక్సాఫీస్ లీడర్ అయింది. ఆ తర్వాత వచ్చిన కొత్త సినిమాలేవీ కూడా దీని ముందు నిలవలేదు. విడుదలైన మూడు, నాలుగు వారాల తర్వాత కూడా ఇదే బాక్సాఫీస్ దగ్గర నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ‘మిస్టర్ మజ్ను’.. ‘యాత్ర’ లాంటి పేరున్న సినిమాలు కూడా దీన్ని జయించలేకపోయాయి.

ఐదో వారంలోనూ చెప్పుకోదగ్గ షేర్‌తో ‘ఎఫ్-2’ ఆధిపత్యం చలాయించింది. ఇప్పటికీ అత్యధిక థియేటర్లలో ఆడుతున్న సినిమా ఇదే. అమేజాన్ ప్రైంలోకి వచ్చాక కూడా థియేటర్ల నుంచి ‘ఎఫ్-2’ను తీసేయలేదు. ఏదైనా కొత్త సినిమా వచ్చి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తే తప్ప ‘ఎఫ్-2’ ఖాళీ చేసే పరిస్థితి కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో ఈ వారం రిలీజవుతున్న కొత్త సినిమాలైనా ‘ఎఫ్-2’కు చెక్ పెడతాయా లేదా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ వారం ఒకటికి రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజవుతున్నాయి. ప్రేమికుల దినోత్సవ కానుకగా ఈ రోజే.. ‘దేవ్’, ‘లవర్స్ డే’ సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇందులో కార్తి, రకుల్ ప్రీత్ నటించిన  ‘దేవ్’ మీద ఓ మోస్తరుగా అంచనాలున్నాయి. ఇంతకుముందు  కాంబినేషన్లో వచ్చిన ‘ఖాకి’ సూపర్ హిట్టయింది.

ఐతే ఆ సినిమాలాగా ఎగ్జైటింగ్ కాన్సెప్ట్ అయితే ‘దేవ్’లో ఉన్నట్లు లేదు. దీని టీజర్, ట్రైలర్ మామూలుగానే అనిపించాయి. సినిమాకు పెద్దగా ఓపెనింగ్స్ రావడం కష్టంగానే ఉంది. ప్రస్తుత అన్ సీజన్లో ప్రేక్షకులు కొత్త సినిమాల వైపు చూసే పరిస్థితే కనిపించడం లేదు. సినిమాకు చాలా మంచి టాక్ వస్తేనే ‘దేవ్’ వైపు ప్రేక్షకులు దృష్టిసారిస్తారు. కాబట్టి రివ్యూలు, టాక్ ఎలా ఉంటుందన్నది కీలకం.

మరోవైపు వింక్ గర్ల్ ప్రియ ప్రకాష్ వారియరే ప్రధాన ఆకర్షణగా ‘లవర్స్ డే’ రిలీజవుతోంది. ఈ సినిమాకు కూడా తెలుగులో బజ్ ఓ మోస్తరుగానే ఉంది. ప్రియను చూడ్డానికి ఏమేరకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో చెప్పలేం. దీనికి కూడా టాక్ కీలకం. సినిమా చాలా బాగుందంటే జనాలు అటువైపు అడుగులేయొచ్చు. మరి ఈ రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకుని ‘ఎఫ్-2’ను థియేటర్ల నుంచి లేపుతాయేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English