ఇది బ్యాడ్ యాటిట్యూడ్ పాపా

ఇది బ్యాడ్ యాటిట్యూడ్ పాపా

నాని 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన చబ్బీ బేబీ మెహ్రీన్ పిర్జాదా. ఈ వైట్ బ్యూటీ మొదటి చూపులోనే సౌత్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అయితే అందంతో అందరిని ఆకట్టుకున్న మేడమ్ గారు గుణంలో మాత్రం ఇండస్ట్రీకి చిరాకు తెప్పిస్తోందట. సినిమా షూటింగ్ అయిపోతే చాలు.. ఓ పనైపోయింది అన్నట్టుగా ఏ మాత్రం పట్టించుకోకుండా జారుకుంటోంది. దేశ విదేశాలకు వెళ్లి హాలిడేస్ అంటూ ఎంజాయ్ చేస్తోంది.

రీసెంట్ గా F2 ఆడియో ఈవెంట్ కి డుమ్మా కొట్టిన మెహ్రీన్ ఇప్పుడు న్యూ యార్క్ లో దర్శనమిచ్చింది. సినిమాకు ప్రమోషన్ చేయాల్సిన టైమ్ లో అసలేమి పట్టనట్టుగా హాలిడేస్ కి వెళ్లడం కరెక్ట్ కాదనే కామెంట్స్ మొదలయ్యాయి. ఈ చబ్బీ బేబీకి ఇది కొత్తేమి కాదు. కవచం సినిమా ప్రమోషన్ లో కూడా  పాల్గొనలేదు. ఎప్పుడు చూసినా హాలిడేస్ అంటూ దేశాలు చుట్టేస్తోంది. కాని అప్పుడంటే కాజల్ తో గొడవ కారణంగా రాలేదని అనుకున్నారందరూ. మరి ఇప్పుడు ఏమైనట్లు?

ఏదేమైనా కూడా ఇండస్ట్రీ లో మెహ్రీన్ ది బ్యాడ్ యాటిట్యూడ్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మెహ్రీన్ ఇలాంటి సమయంలో హాలిడేస్ అంటూ ఎంజాయ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకుంటే చాలా మంచిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English