హీరోయిన్ హిట్.. సినిమా ఫ్లాప్

హీరోయిన్ హిట్.. సినిమా ఫ్లాప్

ఇండియాలో ఏ ఫిలిం ఇండస్ట్రీలో అయినా ఒక స్టార్ వారసుడో.. వారసురాలో అరంగేట్రం చేస్తుంటే ఆసక్తిగా చూస్తారు. ఈ వారం బాలీవుడ్ జనాలు కూడా అలాగే ఆసక్తి ప్రదర్శించారు సారా అలీ ఖాన్ విషయంలో. సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురైన ఈ నవాబుల అమ్మాయి ‘కేదార్ నాథ్’ సినిమాతో కథానాయికగా పరిచయం అయింది.

సుశాంత్ రాజ్ పుత్ సరసన సారా నటించిన ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ సినిమా అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ‘కేదార్ నాథ్’ విషయంలో విమర్శకులందరూ పెదవి విరిచేశారు. ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. సినిమాను పూర్తిగా తీసిపడేయట్లేదు కానీ.. అంచనాలకు తగ్గట్లయితే లేదనే అందరూ అంటున్నారు. దీని టీజర్.. ట్రైలర్ చూసి సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ సినిమా చాలా బోరింగ్ గా సాగడం.. పైపై మెరుగులే తప్ప కథా కథనాల్లో బలం లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్.. పాటల విషయంలో అప్లాజ్ వచ్చింది. కొన్ని ఎపిసోడ్ల వరకు బాగున్నప్పటికీ.. ఓవరాల్ గా సినిమా అంత ఆసక్తికరంగా లేదంటున్నారు. ఐతే హీరోయిన్ సారా గురించి మాత్రం ఫీడ్ బ్యాక్ బాగుంది. ఆమె చాలా అందంగా ఉందని అందరూ కితాబిస్తున్నారు. నటన కూడా పర్వాలేదంటున్నారు.

సుశాంత్ రాజ్ పుత్ ఎప్పట్లాగే అప్లాజ్ తెచ్చుకున్నాడు. అభిషేక్ కపూర్ దర్శకత్వానికి మైనస్ మార్కులే పడ్డాయి. ఓవరాల్ గా సినిమా ఫట్.. హీరోయిన్ హిట్ అనేది ఫైనల్ టాక్‌గా కనిపిస్తోంది. సారా నటించిన రెండో సినిమా ‘సింబా’ సైతం ఇదే నెలలో రిలీజవుతుండటం విశేషం. మరి ఆ చిత్రానికి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English