యన్.టి.ఆర్.. ఒక్కసారిగా కామెడీ అయిపోయిందే

యన్.టి.ఆర్.. ఒక్కసారిగా కామెడీ అయిపోయిందే

తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథతో బాలకృష్ణ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించినపుడు ఈ చిత్రంపై మరీ ఎక్కువ ఆసక్తి ఏమీ కనిపించలేదు. సినిమా ఏకపక్షంగా.. ఫ్లాట్‌గా ఉంటుందన్న అంచనాల వల్ల జనాల్లో ఎగ్జైట్మెంట్ కనిపించలేదు. దీనికి తోడు తేజ దర్శకత్వంలో ఈ చిత్రం మొదలైనట్లే మొదలై ఆగిపోవడం దీనికి ప్రతికూలమైంది. కానీ ఈ చిత్రాన్ని క్రిష్ తన చేతుల్లోకి తీసుకోవడం.. తర్వాత వరుసబెట్టి ఆసక్తికర ప్రోమోలు వదలడంతో అనూహ్యంగా ఈ చిత్రానికి క్రేజ్ వచ్చింది. హైప్ పెరిగింది. ట్రేడ్ వర్గాల్లో ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి నెలకొని.. భారీ బిజినెస్ ఆఫర్లు కూడా వచ్చాయి. మొత్తానికి ‘యన్.టి.ఆర్’ చూస్తుండగానే పెద్ద రేంజికి వెళ్లిపోయింది. కానీ తాజాగా రిలీజైన రెండు పోస్టర్లతో ‘యన్.టి.ఆర్’ చుట్టూ ఒక్కసారిగా నెగెటివిటీ చుట్టుముట్టింది.

అతిలోక సుందరి శ్రీదేవి పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంచుకున్న క్రిష్.. నిన్న ఆమె పుట్టిన రోజు సందర్భంగా శ్రీదేవి లుక్‌తో ఒక పోస్టర్ వదిలాడు. అది చూసి సోషల్ మీడియాలో జనాలు మామూలు కామెడీ చేయట్లేదు. నిన్న ఉదయం నుంచి ఒకటే ట్రోలింగ్ నడుస్తోంది. శ్రీదేవికి రకుల్‌కు అసలేమైనా పోలిక ఉందా.. అసలు ఈ పాత్రకు ఆమెనెలా తీసుకున్నారంటూ జనాలు వాయించేస్తున్నారు. రకరకాల కామెడీ మీమ్స్ పెడుతున్నాడు. ఈమె శ్రీదేవి కాదు.. శ్రీరెడ్డి అంటూ కామెంట్లు కూడా చేస్తుండటం గమనార్హం.

ఆకు చాటు పిందె తడిసె పాట తాలూకు విజువల్ విషయంలోనూ జనాల స్పందన ఇలాగే ఉంది. మొత్తానికి ఇన్నాళ్లూ ఒక రేంజ్ మెయింటైన్ చేస్తూ వచ్చిన ‘యన్.టి.ఆర్’ సినిమా ఇప్పుడు ఒక్కసారిగా కామెడీ అయిపోయింది. దీన్ని పేరడీ సినిమాలతో పోలుస్తున్నారు. ప్రమోషన్ విషయంలో మరీ అగ్రెసివ్‌గా వెళ్తున్న క్రిష్ టీంకు ఇది గట్టి ఎదురు దెబ్బే అని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English