ఎవరినీ వేలెత్తి చూపించరేం?

ఎవరినీ వేలెత్తి చూపించరేం?

సినిమా ఇండస్ట్రీలో పైకి కనిపించే వెలుగు జిలులలన్నీ నిజమే కాదు. ఇక్కడ కంటికి కనిపించని చీకటి కోణాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా అవకాశాల పేరు చెప్పి అమ్మాయిలకు ఎర వేసి వాళ్ల జీవితాలతో ఆడుకుంటారు.. ఇవన్నీ ఎఫ్పటి నుంచో వినిపిస్తున్న మాటలే. వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలని ఫిలింనగర్ కు వస్తే ఎన్నో వేధింపులను భరించాల్సి వస్తోందనే మాట గట్టిగానే వినిపిస్తోంది.  

కాస్టింగ్ కౌచ్ పేరిట ఈ ఇష్యూపై మొదలైన దుమారం నిన్న మొన్నటివరకు టాలీవుడ్ ను పట్టి కుదిపేసింది. నటి శ్రీరెడ్డి ఈ ఇష్యూపై మొదట్లో చాలా హడావుడి చేసింది. తరవాత ఆమె వ్యవహార శైలితో మీడియా.. మహిళా సంఘాలు దూరం పెట్టాయి. ఆ టైంలో చిన్నచిన్న పాత్రలు చేసే చాలామంది నటులు తెలుగులో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ తమ స్వరం వినిపించారు. లేటెస్ట్ గా సీనియర్ నటి ఆమని కూడా ఓ ఇంటర్వ్యూలో ఇదే ఒపీనియన్ చెప్పింది. అవకాశాల పేరు చెప్పి అమ్మాయిలను మభ్యపెట్టి వాళ్ల శరీర అవసరాలు తీర్చుకునే వాళ్లు ఇక్కడా ఉన్నారంటూ కుండబద్దలు కొట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పటిదాకా ఈ ఇష్యూపై మాట్లాడిన వాళ్లంతా సమస్య ఉందని చెబుతున్నారు కానీ దానికి ఎవరు కారకులో చెప్పడం లేదు.

తమకు ఈ చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పడం తప్ప దాని వెనుక ఉన్నదెవరో ఏ హీరోయిన్ కూడా చెప్పడం లేదు. టీవీ ఛానళ్లలో.. సోషల్ మీడియా పోస్టుల్లో హఢావుడి చేయడం తప్ప ఒక్కళ్లూ ధైర్యం చేసి కంప్లయింట్ చేయలేదు. తమను ఇబ్బందిపెట్టింది ఎవరో వాళ్లే చెప్పకుండా ఓన్లీ ఇబ్బంది ఉందని చెప్పి వదిలేస్తే ఏం ప్రయోజనం? దానివలన సమస్య నిజంగా ఉన్నా లేకపోయినా ఫిలిం ఇండస్ర్టీపై మచ్చలు పడిపోవట్లేదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు