పవన్ అండ్ మహేష్‌ కష్టపడరా??

పవన్ అండ్ మహేష్‌ కష్టపడరా??

ఇప్పుడున్న స్టార్ హీరోలందరూ ఏదో ఒక రీతిలో తమ క్యారక్టర్లను పండించడానికి ఒల్లును గుల్ల చేసుకుంటూ చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్.. ఎన్టీఆర్.. రామ్ చరణ్‌ లను చూస్తే.. వాళ్ళు ఒక రేంజులో కసరత్తులు చేస్తున్నారు. కాని కాసింత కూడా పాత్ర కోసం ఒళ్ళును హూనం చేసుకోకుండా.. ఇస్ర్తీ చొక్కా నలగకుండా పనిచేస్తోంది అంటే మాత్రం ఓ ఇద్దరు బడా స్టార్ల గురించి చెప్పుకోవాలి.

ఒక ప్రక్కన అజ్ఞాతవాసి అయినా.. మరో ప్రక్కన భరత్ అను నేను అయినా.. ఈ సినిమాల కోసం మన అతిపెద్ద స్టార్లయిన పవన్ కళ్యాణ్‌ అండ్ మహేష్‌ కేవలం హెయిర్ స్టయిల్ ను కాస్త సరిచేసుకోవడం తప్పించి పెద్దగా కష్టపడింది ఏదీ లేదనేది చాలామంది సినిమా లవ్వర్ల ఫీలింగ్. ముఖ్యంగా వారు అదే పాత లుక్కుతో కనిపిస్తూ.. సీన్లను కూడా అలా అలా నడిపించేస్తున్న తీరు.. కేవలం రైటర్ అండ్ డైరక్టర్ కు పనిపెట్టడమే కాని వీరు పెద్దగా చేతిలో తీసుకుని కొత్తగా మలిచిందేం లేదు అని క్రిటిక్స్ కూడా అనుకోవడం తెలిసిందే. ఒక్క సినిమాలోనైనా డిఫరెంట్ ఫిజిక్ తో కనిపించరు. డిఫరెంట్ ఆటిట్యూడ్ కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నించిన దాఖలాలే కనిపించట్లేదు. అంత సింపుల్ గా సినిమాలను చుట్టేయడం ఎందుకు గురూ? ఇదే హీరోలకు బాహుబలి ఆఫర్ చేసినా.. క్యారక్టర్ కోసం కండలు పెంచమంటే వాకౌట్ చేస్తారేమో అని జోకులేస్తున్నారు జనాలు.

ఇక ఒళ్ళు హూనం చేసుకోవడం అటుంచితే.. అసలు పవన్ కళ్యాణ్‌ స్ర్కిప్టు కూడా చదువుతాడో లేదో అని అజ్ఞాతవాసి చూశాక డౌట్లు వచ్చేశాయి. మహేష్‌ కోసమైతే కనీసం నమ్రత చదువుతుంది అనే రూమర్లు అయినా ఉన్నాయ్. పవన్ కు ఆ ఫెసిలిటీ కూడా లేదులే. బాగా కష్టపడుతున్నారు అంటే బన్నీ.. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్‌ అనే చెప్పాలి. బాడీని ఒంచుతూ.. మార్పులు చేసుకుంటూ.. ఆ రోల్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తూ.. ఇతర యంగ్ హీరోలకు చాలా టార్గెట్లు సెట్ చేస్తున్నారు. కాని 40 ప్లస్ హీరోయిలన పవన్ అండ్ మహేష్‌ మాత్రం.. అటు ప్రక్కన 50+ బాబులు సల్మాన్ అండ్ అక్షయ్ ఎలా శ్రమిస్తున్నారో చూసి ఏమీ పెద్దగా ప్రేరణ పొందుతున్నట్లే లేరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు