అదే దేవిశ్రీ ప్రసాద్ స్పెషాలిటీ

అదే దేవిశ్రీ ప్రసాద్ స్పెషాలిటీ

ఇప్పుటు టాలీవుడ్‌... కోలీవుడ్‌ల‌లో... మోస్ట్ వాంటెడ్ మ్యూజిషియ‌న్ దేవి శ్రీ ప్ర‌సాద్‌. అత‌ను ఉంటే చాలు సినిమా హిట్ కొట్టేస్తుంద‌న్న న‌మ్మ‌కం వచ్చేసింది సినీ జ‌నాల్లో. ఇప్పుడు ఆయ‌న రంగ‌స్థ‌లం చిత్రానికి కూడా మంచి సంగీతాన్ని అందించారు. ఎంత స‌క్కగున్నావే ల‌చ్చిమీ పాట వింటే చాలు... దేవి శ్రీ టాలెంట్ తెలిసిపోవ‌డానికి. టాలీవుడ్‌లో ఇంతమంది సంగీత ద‌ర్శ‌కులు ఉన్నా... ద‌ర్శ‌క నిర్మాత‌లంతా దేవీ వెంటే ప‌డ‌డానికి కార‌ణం ఏంటీ?

ఊహ‌లు క‌ల‌లు క‌న్నా.. రియాల్టీనే ఇష్ట‌ప‌డే జ‌నాలు ఎక్కువ‌. ఆ విష‌యం దేవిశ్రీకి బాగా తెలుసు. అందుకే సంగీతం కూర్చేట‌ప్పుడు ఎన్నో ప్ర‌యోగాలు చేస్తూ ఉంటాడు. వ‌ర్షం సినిమాలో ఇన్నాళ్ల‌కు గుర్తొచ్చానా వానా... అనే పాట‌లో నీళ్ల శ‌బ్ధం కూడా చాలా చ‌క్క‌గా వినిపిస్తుంది. అందుకు దేవి పెద్ద డ్రమ్ముల్లో నీళ్ళని పోయించి.. వాటిపై వాయించాడ‌ట‌. అలాగే ఇద్ద‌ర‌మ్మాయిలో సినిమాలో  స్పెయిన్‌లో తీసిన పాట ర‌న్ ర‌న్‌. ఆ పాట కోసం స్పెయిన్ లో లైవ్ ప్రోగ్రామ్ నుండి రికార్డు చేశాడట. రోడ్డు మీద వాయించే వాయిద్యకారుల సౌండ్ తీసుకున్నాడట. ఆ రెండు పాట‌లు చాలా మంచి ఆద‌ర‌ణే పొందాయి. పాట బాగుండ‌డం కోసం ఎంతైనా క‌ష్ట‌ప‌డ‌తాడు దేవీ. ఆ క‌ష్టాన్ని క‌ళ్లారా చూసిన ద‌ర్శ‌కులు దేవిశ్రీనే త‌మ సినిమాకు పెట్టుకోవ‌డానికి ఇష్ట‌ప‌డతారు.

దర్శకుడు సుకుమార్ 1985 కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా రంగ‌స్థ‌లం. రామ్‌చరణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, ఆది, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఇప్ప‌టికే ఎంత‌స‌క్క‌గున్నావే సాంగ్ సూప‌ర్ హిట్ కొట్టింది. మార్చి 2న మ‌రో పాట రాబోతోంది. అది ఒక జాన‌ప‌ద గేయమ‌ని తెలుస్తోంది. ఫోక్ సాంగ్ అన‌గానే... దేవి నిజంగా జాన‌ప‌ద క‌ళాకారులను తెప్పించి... బూర‌లు డ‌ప్పులు సంప్ర‌దాయ సంగీత వాయిద్యాల మ‌ధ్య పాట‌ను రికార్డు చేయించాడు. ఊళ్ల‌లో జాత‌ర‌కు వాయించే వారి చేతనే అద్భుతంగా పాట‌ను రికార్డు చేశాడు. ఆ పాట ఎలా ఉంటుందో తెలియాలంటే ఒక్క‌రోజు ఆగితే చాలు.

రియాల్టీగా ఉండ‌డం కోసం ఇంత క‌ష్ట‌ప‌డ‌తాడు కాబ‌ట్టే... దేవిశ్రీకి ఎంత డ‌బ్బిచ్చి అయినా త‌మ సినిమాకు ఎంపిక చేసుకోవ‌డానికి సిద్ధంగా ఉంటారు నిర్మాత‌లు. దేవి శ్రీ క‌ష్టానికి త‌గ్గ‌ట్టే... కోట్ల‌లో ఛార్జ్ చేస్తాడు. ఆణిముత్యాల్లాంటి పాట‌ల‌ను... సంగీతాన్ని ఇస్తుంటే... నిర్మాత‌లు ఎంత ఇవ్వ‌డానికైనా సిద్ధ‌ప‌డిపోతారు. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు