అతడి ఆశల్ని ముంచేసిన అజ్ఞాతవాసి

అతడి ఆశల్ని ముంచేసిన అజ్ఞాతవాసి

పవన్‌ కళ్యాణ్‌... త్రివిక్రమ్‌... ఈ రెండు పేర్లు ఒక సినిమాతో అసోసియేట్‌ అయితే దానికి వుండే క్రేజే వేరు. అలాంటిది ఈ ఇద్దరి పేర్లు వున్నా కూడా ఒక సినిమాకి ఎలాంటి అడిషనల్‌ అడ్వాంటేజ్‌ కనిపించడం లేదు. కారణం ఆ ఇద్దరినుంచి వచ్చిన అజ్ఞాతవాసి దారుణమైన ఫ్లాప్‌ అవడం. నితిన్‌ కొత్త సినిమా 'ఛల్‌ మోహన్‌రంగ'కి పవన్‌, త్రివిక్రమ్‌ నిర్మాణ భాగస్వాములుగా వున్నారు.

నితిన్‌ ఇరవై అయిదవ చిత్రమైన దీనికి మొదట్లో వీరిద్దరి పేర్ల వల్ల చాలా క్రేజొచ్చింది. అజ్ఞాతవాసి కనుక అంచనాలని అందుకుని వుంటే ఇప్పుడు నితిన్‌ సినిమాకి క్రేజ్‌ పీక్స్‌లో వుండేది. అటు పవన్‌, ఇటు త్రివిక్రమ్‌ ఇద్దరి పరపతిని దెబ్బతీసేలా ఫ్లాప్‌ అయిన అజ్ఞాతవాసి ఎఫెక్ట్‌ ఛల్‌ మోహన్‌రంగపై పడుతోంది. చాలా క్రేజీ ప్రాజెక్ట్‌ అవుతుందని అనుకున్నది కాస్తా ఎలాంటి బజ్‌ క్రియేట్‌ చేయలేకపోతోంది. పవన్‌ ఫాన్స్‌ కూడా నీరుగారిపోయి వుండడంతో నితిన్‌ చిత్రానికి జరగాల్సిన సందడి జరగట్లేదు.

నితిన్‌ హీరోగా నటించిన గత చిత్రం లై పెద్ద డిజాస్టర్‌ కావడం కూడా ఈ చిత్రానికి ప్రతికూలంగా మారింది. క్రేజ్‌తోనే సంచలనం అవుతుందని అనుకున్న సినిమా కాస్తా ఇప్పుడు కంటెంట్‌ మీదే డిపెండ్‌ అవ్వాల్సి వుంటుంది. నితిన్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసిన క్రేజ్‌ జనరేట్‌ కాని నేపథ్యంలో ఈ చిత్రంలో బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుకునే దమ్ము ఎంత వుందనేది వేచి చూడాల్సిందే మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English