ఆ విలక్షణ దర్శకుడు కన్నుమూశాడు

ఆ విలక్షణ దర్శకుడు కన్నుమూశాడు

కాశీనాథ్.. 90ల్లో సినిమాల్ని అనుసరించిన వాళ్లకు ఈ పేరు బాగానే పరిచయం. కన్నడలో తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో వెరైటీ సినిమాలు తీసిన విలక్షణ నటుడితను. 67 ఏళ్ల కాశీనాథ్ గురువారం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయనకు కొంత కాలంగా ఆరోగ్యం బాగా లేదు. రెండు రోజుల కిందటే బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో ఆయన్ని చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం కాశీనాథ్ తుది శ్వాస విడిచాడు.

కాశీనాథ్ సినిమాలంటే కామెడీకి పెట్టింది పేరు. ఐతే అతడి సినిమాల్లో కొంచెం శృంగారం పాళ్లు ఎక్కువే ఉండేవి. కాశీనాథ్ సినిమాలు తెలుగులోనూ విడుదలై బాగా ఆడాయి. ‘వింత శోభనం’.. ‘అనుభవం’.. ‘భూలోకంలో రంభ ఊర్వశి మేనక’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించాడు కాశీనాథ్. హీరోగా 40 సినిమాల దాకా చేసిన కాశీనాథ్.. వాటిలో చాలా వాటికి తనే దర్శకత్వం వహించాడు. కన్నడ సినిమాలో మూసకు తెరదించిన దర్శకుల్లో ఒకడిగా కాశీనాథ్‌ను చెబుతారు.

నటుడు, దర్శకుడిగానే కాక.. ఒక సూపర్ స్టార్‌‌ను కన్నడ పరిశ్రమకు అందించిన గురువుగానూ కాశీనాథ్ పేరు నిలిచిపోతుంది. విలక్షణ నటుడు, దర్శకుడు ఉపేంద్ర.. కాశీనాథ్ శిష్యుడే. నటుడిగా, దర్శకుడిగా కాశీనాథ్ దగ్గర ఓనమాలు దిద్దుకున్న ఉపేంద్ర.. గురువు బాటలోనే విభిన్నమైన సినిమాలు చేశాడు. తర్వాత గురువును మించి శిష్యుడయ్యాడు. కాశీనాథ్ మరణ వార్త విన్న వెంటనే అతను ఆసుపత్రికి చేరుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English