భలే ట్విస్ట్.. పవన్ కొత్త సినిమా జనవరి నుంచి

భలే ట్విస్ట్.. పవన్ కొత్త సినిమా జనవరి నుంచి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది ‘కాటమరాయుడు’తో పాటు త్రివిక్రమ్ సినిమాకు.. అలాగే ఎ.ఎం.రత్నం నిర్మాణంలో మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ‘కాటమరాయుడు’ పూర్తయి రిలీజైపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. కానీ రత్నం సినిమా సంగతేంటో మాత్రం తేలలేదు. చాన్నాళ్లుగా ఆ సినిమా గురించి ఏ వార్తా లేకపోవడంతో అది ఇక మరుగున పడినట్లే అనుకున్నారంతా. పైగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా ఓ సినిమా చేయడానికి పవన్ రెడీ అవుతున్నాడన్న ప్రచారంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. ఇక రత్నం సినిమా లేదనే అందరూ ఫిక్సయిపోయారు.

కానీ రత్నం నిర్మాణంలో నీశన్ దర్శకుడిగా సినిమా మొదలుపెట్టడానికి పవన్ రెడీ అవుతున్నాడట. ఈ విషయాన్ని రత్నం తనయుడు జ్యోతికృష్ణే వెల్లడించాడు. తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆక్సిజన్’ ప్రి రిలీజ్ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన అతను ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. పవన్ సినిమా జనవరి నుంచి సెట్స్ మీదికి వెళ్తుందని అతను చెప్పాడు. దీనికి స్క్రిప్టు లాక్ అయిందని అతను కన్ఫమ్ చేశాడు. ఈ సినిమా అజిత్ హిట్ మూవీ ‘వేదాళం’కు రీమేక్ అని ఇంతకుముందే వెల్లడైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి 2019 ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉన్న నేపథ్యంలో పవన్ ఇక సినిమాలకు టాటా చెప్పేస్తాడని.. ‘అజ్నాతవాసి’నే ప్రస్తుతానికి చివరి సినిమా కావచ్చని కూడా ప్రచారం జరిగింది. కానీ రత్నం సినిమాకు పవన్ రెడీ అయిపోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు