అమీ జాక్సన్‌ను రఫ్ఫాడుకున్నారు

అమీ జాక్సన్‌ను రఫ్ఫాడుకున్నారు

ఎవరు ఎందులో స్పెషలిస్టు.. ఎక్కడికి ఎవరిని పిలిస్తే బాగుంటుందనేది కొంచెం చూస్కోవాలి. హాట్ హాట్ ఫొటో షూట్లకైతే అమీ జాక్సన్ ఓకే కానీ.. స్టేజ్ మీద డ్యాన్సులేయడానికి ఆమె ఏం పనికొస్తుంది? ఇదంతా ఆలోచించకుండా అమ్మడిది ఇంటర్నేషనల్ రేంజ్ కదా అని ఇండియన్ ప్రిమియర్ లీగ్ పదో సీజన్ ఆరంభోత్సవానికి పట్టుకొచ్చారు. ఆమెతో డ్యాన్స్ చేయించారు. ఐతే ఇందుకోసం అమీకి ఎవరు స్టెప్పులు నేర్పించారో కానీ.. అవి మరీ సిల్లీగా తయారయ్యాయి. నిన్నటి ఆరంభ వేడుక అంతా అంగరంగ వైభవంగా జరిగింది కానీ.. అమీ డ్యాన్సే తేలిపోయింది.

అభిమానుల ఆకాంక్షలకు భిన్నంగా ఒంటిని బట్టలతో కప్పుకుని వచ్చి వాళ్లను నిరాశ పరిచిన అమీ.. డ్యాన్స్ కూడా ఘోరంగా చేసింది. ఆమె హావభావాలు.. స్టెప్పులు తేలిపోయాయి. ఇక సోషల్ మీడియాలో జనాల ట్రోలింగ్ సంగతి చెప్పేదేముంది? అమీని ఒక ఆటాడేసుకున్నారంతే. బాలీవుడ్లో బ్యాడ్ డ్యాన్సర్ అయిన సన్నీ .. అమీ కంటే బాగా డ్యాన్స్ చేస్తారని ఒకరంటే.. తన ఇన్‌స్ట్రక్టర్ క్లాసులో లేనపుడు.. జుంబా డ్యాన్స్ చేసినట్లుగా ఉందని ఇంకొకరు సెటైర్ వేశారు. ఇలా జనాలు ఎవరి స్థాయిలో వాళ్లు అమీని ఆడుకున్నారు.

ఈ వేడుకలో డ్యాన్స్ చేయడానికి అమీ పారితోషకం మాత్రం భారీ స్థాయిలో తీసుకుందట. దీని బదులు లోకల్ హీరోయిన్లను పెట్టుకుని ఉంటే డబ్బు ఆదా అయ్యేది.. అలాగే డ్యాన్స్ కూడా బాగుండేదంటూ నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు