పవన్‌కళ్యాణ్‌కి ఇవి అవసరమా అసలు?

పవన్‌కళ్యాణ్‌కి ఇవి అవసరమా అసలు?


పవన్‌కళ్యాణ్‌ని ఏ దశలోను మాస్‌ హీరోగా ఆడియన్స్‌ పరిగణించలేదు. కెరియర్‌ ఆరంభంలో అన్నీ యూత్‌ఫుల్‌ సినిమాలే చేసిన పవన్‌కళ్యాణ్‌ మొదటిసారిగా మాస్‌ క్యారెక్టర్‌ని గుడుంబా శంకర్‌లో చేసాడు. ఆ తర్వాత అన్నవరం, బంగారం, కొమరం పులి చిత్రాల్లో అటెంప్ట్‌ చేసాడు. వీటి ఫలితం ఏమిటనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

పవన్‌కి మొదటిసారిగా మాస్‌ క్యారెక్టర్‌లో సక్సెస్‌ వచ్చిన సినిమా 'గబ్బర్‌సింగ్‌'. అది మాస్‌ క్యారెక్టర్‌ అయినప్పటికీ పవన్‌ని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో అదే విధంగా ప్రెజెంట్‌ చేసాడు హరీష్‌ శంకర్‌. ఆ తర్వాత 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో, మళ్లీ ఇప్పుడు 'కాటమరాయుడు'లో పవన్‌ మాస్‌ క్యారెక్టర్‌ ట్రై చేసాడు. ఈ రెండు సినిమాల్లోను పవన్‌ని చూస్తే ఒకటి క్లియర్‌గా తెలుస్తుంది. ఇది పవన్‌ కంఫర్ట్‌ జోన్‌ కాదని.

పవన్‌ని అర్బన్‌ స్టయిల్లో ట్రెండీగా చూడ్డానికే ప్రేక్షకులు ఇష్టపడతారు తప్ప మాస్‌ పాత్రల్లో అతను కూడా ఈజ్‌తో కనిపించడు. తన సహజ శైలికి భిన్నంగా ఎనర్జిటిక్‌గా కాకుండా కాస్త బిగుసుకుపోయి కనిపిస్తుంటాడు. నటించడానికి పట్టుబట్టి ప్రయత్నిస్తుంటాడే తప్ప తేలికగా నటించేస్తున్నట్టు అనిపించడు. ఇంత ఇబ్బంది పడుతూ మాస్‌ సినిమాలని పవన్‌ ఎందుకు చేస్తున్నాడనేది అర్థం కాదు. బహుశా తన సినిమాలపై వుండే అపారమైన అంచనాలని అందుకునేందుకు సేఫ్‌ బెట్‌ అనిపించే మాస్‌ చిత్రాలని ఎంచుకుంటున్నాడేమో. అదే నిజమైతే పవన్‌ రాంగ్‌ ట్రాక్‌లో వెళుతున్నాడనే అర్థం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు