లావణ్యతో క్లీవేజ్ షోలా?

లావణ్యతో క్లీవేజ్ షోలా?‘ఏమాయ చేసావె’లో సమంత తర్వాత.. గత పదేళ్లలో తెలుగులో తొలి సినిమాతోనే బలమైన ముద్ర వేసిన హీరోయిన్ ఇంకెవరైనా ఉన్నారు అంటే అది లావణ్య త్రిపాఠినే. ‘అందాల రాక్షసి’ సినిమా ఎలా ఆడినా.. లావణ్య వేసిన ఇంపాక్ట్ మాత్రం అలాంటిలాంటిది కాదు. సినిమా చూసిన వాళ్లకు నిజంగా ఆమె అందాల రాక్షసిలాగే అనిపించింది. ఆ సినిమా తర్వాత ఆశించిన అవకాశాలు రాకపోయినా.. కొంచెం లేటుగా అయినా లావణ్య కెరీర్ ఊపందుకోవడంతో ఈ అందాల రాక్షసితో ప్రేమలో పడిపోయిన వాళ్లందరూ సంతోషించారు.

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా లాంటి సినిమాల్లో లావణ్య అందం ప్లస్ అభినయానికి ముగ్ధులైపోయారు. మరింతమంది ఆమె అభిమానులుగా మారిపోయారు. ఐతే లావణ్య లాంటి హీరోయిన్లను అందంగా చూడాలనుకుంటారు తప్పితే.. రెగ్యులర్ హీరోయిన్ల తరహాలో స్కిన్ షో చేస్తే చూడటానికి ఎక్కువమంది ప్రేక్షకులు అంత సుముఖంగా ఉండరు. ఐతే ‘శ్రీరస్తు శుభమస్తు’లో ఆమెను పరశురామ్ ఈ రకంగానే ప్రెజెంట్ చేశాడేమో అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

ట్రైలర్లో ఒకటికి రెండు చోట్ల లావణ్యతో క్లీవేజ్ షో చేయించారు. డోస్ మరీ ఎక్కువేమీ అయిపోలేదు కానీ.. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్లో లావణ్య లాంటి హీరోయిన్ని ఇలా చూపించడం మాత్రం అదోలాగే అనిపించింది. లావణ్య లాంటి హీరోయిన్లు అందంగా కనిపిస్తే బాగుంటుంది కానీ.. అందాలు ఆరబోస్తే మాత్రం ఆక్వార్డ్‌గానే ఉంటుంది. మరి సినిమాలో లావణ్య డోస్ మరింత పెంచిందేమో ఏమో.. ఆగస్టు 5 వరకు ఎదురు చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English