Political News

దసరా మద్యం అమ్మకాలు: తెలంగాణలో మరో న్యూ రికార్డ్

తెలంగాణ పండుగల్లో ఉండే జోష్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక దసరా పండుగ సమయంలో సుక్కా ముక్కా లేదంటే కిక్కు ఉండదనేది కొందరి అభిప్రాయం. ఈసారి మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దసరా పండుగ సీజన్‌లో రాష్ట్రంలో మద్యం విక్రయాలు రూ. 1,100 కోట్లకు పైగా చేరుకున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. 

11వ తేదీకి ఒక్కరోజే రూ. 200.44 కోట్ల విలువైన మద్యం అమ్ముడవ్వగా, 10వ తేదీన రూ. 152 కోట్లకు పైగా అమ్మకాలు నమోదయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి 10 వరకు మొత్తం రూ. 852.40 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి వంటి నగరాల్లో మద్యం విక్రయాలు అత్యధికంగా ఉండగా, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. 

దసరా పండుగ సీజన్ ముందు నుంచే మద్యం విక్రయాలు మొదలై శని, ఆదివారాల్లో మరింత ఉధృతికి చేరుకున్నాయి. బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు కూడా ఈ టైమ్ లో అధికంగా మద్యం విక్రయించాయి. తెలంగాణలో మొత్తం 2,260 మద్యం దుకాణాలు, 1,171 బార్లు మరియు రెస్టారెంట్లు ఉన్నాయి. పబ్బుల్లో కూడా మద్యం అమ్మకాలు జరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ 30 వరకు మద్యం విక్రయాలు రూ. 2,838 కోట్లకు చేరగా, అక్టోబర్ మొదటి పది రోజుల్లో రూ. 1,100 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. 10 రోజుల వ్యవధిలో 17 లక్షల 59 వేల బీర్లు విక్రయమయ్యాయని తెలుస్తోంది.

This post was last modified on October 15, 2024 12:02 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

48 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago