Political News

ఏడు దశాబ్దాల ప్రభుత్వాసుపత్రుల చరిత్ర తిరగరాయాలి:జగన్

తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమ పథకాల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే తాను రెండడుగులు ముందుకు వేస్తానని సీఎం జగన్ చాలా సార్లు స్పష్టం చేశారు. మాట తిప్పను… మడమ తిప్పను అని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగానే ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్నారు జగన్.

ముఖ్యంగా వైద్య, విద్యారంగాలకు పెద్దపీట వేస్తానని హామీ ఇచ్చిన జగన్ ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేశారు. కరోనా విపత్తును సమర్థవంతగా ఎదుర్కొంటూనే వైద్యరంగాన్ని, ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టిన జగన్…ఇకపై ఆసుపత్రుల్లో నాడు-నేడుపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

70 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా రాష్ట్రంలోని ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని చెప్పారు. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో ఆస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయని జగన్ అభిప్రాయపడ్డారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ పలు కీలక అంశాలపై చర్చించారు.

రాష్ట్రంలోని అన్ నిప్రభుత్వ ఆసుత్రులలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలని, నిర్మాణ విషయంలో రాజీ పడొద్దని జగన్ స్పష్టం చేశారు. ఇకపై ప్రభుత్వాసుపత్రులు కార్పొరేట్‌ లుక్ లో కనిపించాలని, చరిత్రలో నిల్చిపోయే విధంగా ప్రభుత్వాసుపత్రుల నిర్మాణం జరగాలని అన్నారు.

మూడేళ్లలో అన్ని ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తి కావాలని, ప్రతి ఆసుపత్రి బెస్టుగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రులలో యంత్రాలు, ఏసీలు, లిఫ్ట్‌లు, ఎలక్ట్రికల్, నాన్‌ ఎలక్ట్రికల్‌ ఉపకరణాలు, ఫైర్‌ కంట్రోల్‌ ఎక్విప్‌మెంట్‌ వంటి అన్నింటి నిర్వహణ బాధ్యత ఏడేళ్ల పాటు అప్పగించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో తప్పనిసరిగా సెంట్రలైజ్డ్‌ ఏసీ ఉండాలని, డాక్టర్లు ఇబ్బంది పడకుండా ఉంటేనే చక్కగా సేవలందించగలుగుతారని అన్నారు.

పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో వైద్య కళాళాలల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, అన్ని పనులు పూర్తయ్యాయని, టెండర్ల ఖరారు ప్రక్రియ, జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపుతామని అధికారులు వివరించారు. బాపట్ల, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి, మార్కాపురం, మదనపల్లె, నంద్యాల మెడికల్‌ కాలేజీల టెండర్ల జ్యుడీషియల్‌ ప్రివ్యూ అక్టోబరులో జరుగుతుందన్నారు. నరసాపురం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్‌ కాలేజీల టెండర్లను నవంబరు నెలలో జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపిస్తామని అధికారులు వివరించారు.పాడేరులో వైద్య కళాశాలతో పాటు, ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులను సీఎం జగన్, అక్టోబరు 2న ప్రారంభిస్తారని అధికారులు వివరించారు.

This post was last modified on September 30, 2020 11:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతికి హడ్కో నిధులు వచ్చేశాయి!

ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…

3 hours ago

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

10 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

10 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

11 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

12 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

12 hours ago